
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘నాగబంధం’. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి ఎన్‌ఐకే స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. నాగబంధం ద్వారా రక్షించబడుతున్న 108 విష్ణు దేవాలయాల బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లీలావతి పాత్రలో అనసూయ మిస్టీరియస్‌లో రోల్ చేస్తుంది.
మరోవైపు, ‘కేజీఎఫ్’ ఫేమ్ అవినాష్ అఘోరా పాత్రలో నటిస్తున్నాడు. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్, అభే సంగీతం అందిస్తున్నారు. ఈ హిస్టారికల్ మైథికల్ థ్రిల్లర్ పాన్ ఇండియా స్థాయిలో జులై 3న విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా ‘నాగబంధం’ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ గూస్ బంప్స్..
3 నిమిషాల 19 సెకెన్ల ‘నాగబంధం’ ట్రైలర్.. సినిమా స్థాయి, విజువల్స్, కథపై మరింత ఆసక్తిని పెంచేలా అదిరిపోయింది. యాక్షన్ సన్నివేశాలతో పాటు సస్పెన్స్ ఎలిమెంట్స్తో ట్రైలర్ను నింపేశారు. గుప్త నిధులకు పురాణ ఇతిహాసాలను మిళితం చేస్తూ విష్ణు దేవాలయాల చుట్టూ ఉన్న రహస్యాన్ని చూపించిన ఎలెమెంట్స్ ఆడియన్స్లో ఉత్కంఠ పెంచేలా ఉన్నాయి. సినిమా మొదలైనప్పటి నుంచి విరాట్ కర్ణను పరమ శివుడి ఉగ్ర రూపంలో పాత్రను చూపిస్తూ వస్తున్న మేకర్స్.. ట్రైలర్తో మరింత ఎలివేషన్స్ ఇచ్చారు.
ఓవరాల్గా వేల ఏళ్ల నాటి రహస్యం.. ఒక మనిషి స్వార్థం.. అతని స్వార్థం కారణంగా జరిగిన వినాశనం.. వినాశకాలే విపరీత బుద్ధి అని తెలియజెప్పే ప్రయత్నంగా సినిమాను మలిచాడు దర్శకుడు. అందుకు తగ్గట్టుగానే భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌లతో ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
దేశవ్యాప్తంగా భారీ ప్రమోషనల్ టూర్..
సాధారణ ప్రమోషన్స్‌కు భిన్నంగా, సినిమా కథలోని ట్రెజర్ హంట్ కాన్సెప్ట్‌కు అనుగుణంగా ఈ ప్రమోషనల్ టూర్‌ను రూపొందించారు. ఈ టూర్‌లో తొలి కార్యక్రమం ఇవాళ జూన్ 19న హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ తో మొదలైంది. అనంతరం జూన్ 20 నుంచి 23 వరకు ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చి నగరాల్లో వరుసగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
జూన్ 26న వారణాసిలో ‘వీర నాగ’ పాటను విడుదల చేయడం ఈ టూర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక జూన్ 28న హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్, జులై 2న స్పెషల్ ప్రీమియర్ షో నిర్వహించనున్నారు. మరోవైపు ఈ మూవీ నైజాం థియేట్రికల్ రైట్స్‌ను దిల్ రాజు సొంతం చేసుకోవడంతో, ఈ చిత్రం తెలంగాణలో భారీ స్థాయిలో విడుదల కానుంది.
#DilRaju acquires the nizam rights of the MOST ANTICIPATED #Nagabandham 🔥🐍⚔️
A massive milestone in the journey of Nagabandham 🤩
Nizam Distribution by @SVCRelease ❤️🔥💥
In Cinemas Worldwide on July 3rd 🌍 pic.twitter.com/U94qYGDJ43
— ABHISHEK PICTURES (@AbhishekPicture) June 7, 2026