
పద్మారావునగర్, వెలుగు: నగరంలో నిలుస్తున్న వర్షపు నీటిని వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి సోమాజిగూడ జీఆర్టీ జంక్షన్, ప్రజాభవన్ పరిసరాల్లో నిలిచిన నీటిని ఆయన పరిశీలించారు. జీహెచ్‌ఎంసీతో సమన్వయం చేసుకుని నీటిని త్వరగా తొలగించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. చికోటి గార్డెన్స్ ప్రాంతంలో నిలిచిన నీటిని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి పరిశీలించారు. నీరు, చెత్త, -మట్టిని తొలగించి వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా చూడాలని అధికారులకు సూచించారు.