Reading Time: < 1 minute

తెలంగాణలో 5లక్షల డూప్లికేట్ ఓట్లు: రాష్ట్ర ఎన్నికల సంఘం

Caption of Image.
  • తెలంగాణలో 5లక్షల డూప్లికేట్ ఓట్లు
  • 85 లక్షల మంది అనుమానిత ఓటర్లు
  • SIR ఓటర్లను తొలగించే ప్రక్రియ కాదు 
  • SIR పై ఎలాంటి అనుమానాలు వద్దు :రాష్ట్ర ఎన్నికల సంఘం 
  • సరైన ఆధారాలు చూపని ఓటర్లకు BLO లు నోటీసులు 
  • జూన్ 25 నుంచి SIR ఇంటింటి సర్వే..అక్టోబర్1న ఫైనల్ ఓటర్ లిస్ట్  

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(IR)లో భాగంగా ఓటర్ల వివరాల ధృవీకరణ చేపట్టేందుకు రెడీ అవుతోంది ఎన్నికల సంఘం. రాష్ట్రంలో మొత్తం 85 లక్షల అనుమానిత ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. ఇందులో 5లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి.  ఓటర్ల ధృవీకరణ కోసం జూన్ 25న SIR ఇంటింటి సర్వే నిర్వహించనుంది.  నెలరోజుల పాటు ఇంటింటి సర్వే అనంతరం జూలై 31న డ్రాఫ్ట్ ఓటరు జాబితాను విడుదల చేయనుంది. ఆ తర్వాత ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.  సెప్టెంబర్  28 వరకు విచారణ, వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. చివరగా అక్టోబర్1న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి తెలిపారు. 

స్వచ్ఛమైన, ఖచ్చితమైన  ఓటరు జాబితాకోసం  SIR ప్రక్రియన  చేపడుతున్నాం.. ప్రజలు సర్వే సిబ్బందికి సహకరించాలని  సీఈవో సుదర్శన్ రెడ్డి అన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా మ్యాపింగ్ ప్రక్రియ  పూర్తి అయింది..70.5 శాతం పూర్తి అయింది..గ్రామాల్లో 80శాతం దాటింది. పట్టణాల్లో మాత్రం పూర్తి కాలేదన్నారు. మ్యాపింగ్ BLO లకు అవగాహన కోసం మాత్రమే నిర్వహించే ప్రక్రియ.. మ్యాపింగ్ అవ్వకపోతే ఓటు పోదు..BLO లు ఇచ్చిన ఫామ్ లు నింపి ఇస్తే సరిపోతుందని సీఈవో తెలిపారు.

సర్ ప్రక్రియలో  ఓటు పోతుంది అనే అపోహ అవసరం లేదు.. 85 లక్షల మంది ఓటర్లను అనుమానితులుగా గుర్తించాం.. సరైన ఆధారాలు చూపని ఓటర్లకు BLO లు నోటీసులు ఇచ్చారు.. వాళ్ళ డాక్యుమెట్స్ పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని సీఈవో చెప్పారు. ఓటర్లను తీసెయ్యాలి అనేది SIR ప్రక్రియ కాదు.. SIR పై ఎలాంటి అనుమానాలు వద్దని ఆయన స్పష్టం చేశారు. 

©️ VIL Media Pvt Ltd.