
హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండల సమీపంలోని శ్రీశైలం చౌరస్తాలో కోదాడ–జడ్చర్ల హైవేపై ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న నలుగురు అప్రమత్తమై కిందికి దిగడంతో ప్రమాదం తప్పింది. క్షణాల్లో కారు మంటల్లో తగలబడిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉండగా.. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామన్నగూడెం స్టేజ్ సమీపంలో రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు.
మృతుల్లో పల్నాడు జిల్లాకు చెందిన తండ్రి, కొడుకు ఉన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సైట్ ఇంజినీర్ సాయికుమార్ కూడా మృతి చెందారు. క్షతగాత్రులకు నాగార్జునసాగర్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. బాధిత కుటుంబాలకు ఎస్పీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
►ALSO READ | ఇన్‌స్టాగ్రామ్ లవ్.. పెళ్లి పేరుతో ఇద్దరు యువతులకు వల..రూ.12 లక్షలు, 2 తులాల బంగారం లూటీ