Reading Time: 2 minutes
Watch: గిన్నెలు కడగడంలో అమ్మమ్మ ఐడియా అదుర్స్‌..ఈ చిన్న ట్రిక్‌తో మీ పని సూపర్‌ఫాస్టే!

ఇంటి పనుల్లో అన్నిటికంటే విసుగు తెప్పించే పని ఏదైనా ఉందంటే అది గిన్నెలు తోమడమే అని చాలా మంది గృహిణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు లేదా ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు సింక్ నిండా పేరుకుపోయే గిన్నెలు, గ్లాసులను కడగడం ఒక పెద్ద టాస్క్. అయితే, కష్టమైన పనిని కూడా తమదైన చిట్కాలతో ఎంతో సులువుగా ఎలా మార్చుకోవాలో మన పెద్దవారికి బాగా తెలుసు. తాజాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను చూస్తే ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది.

ఇంటర్నెట్‌లో నిత్యం అనేక రకాల వంటగది చిట్కాలు (Kitchen Hacks) వైరల్ అవుతుంటాయి. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఒక వృద్ధురాలి వీడియో గృహిణులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఆమె ఇంట్లో ఉన్న ఎక్కువ మొత్తంలో గ్లాసులు, గిన్నెలను తక్కువ సమయంలో కడగడానికి ఒక వినూత్న ఉపాయాన్ని ప్రదర్శించింది. సాధారణంగా ఒక్కో గిన్నెను విడిగా తోమే అవసరం లేకుండా, ఒకేసారి అన్నిటినీ శుభ్రం చేసేలా ఆమె చేసిన దేశీ జుగాడ్ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. techzany అనే ఐడి ద్వారా పోస్ట్ అయిన ఈ వీడియోకు లక్షలాది వ్యూస్‌ రాగా, బామ్మగారి స్మార్ట్ వర్కింగ్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వృద్ధురాలు వంటగదిలో పేరుకుపోయిన గిన్నెలు, స్టీల్ గ్లాసులను చాలా వేగంగా కడగడానికి ఒక స్మార్ట్ ఐడియాను ఉపయోగించింది. సాధారణంగా గ్రామాలు, పల్లెల్లో సింక్‌లు, వాష్‌ బేసన్లు వంటివి చాలా తక్కువ మంది ఇళ్లల్లో మాత్రమే ఉంటాయి. ఎక్కువగా వారు గిన్నెలన్నీ ఒకేసారి బయట వాషింగ్‌ ఏరియాలో వేసుకుని తోముతుంటారు. నల్లా నీళ్లు వస్తున్న టైమ్‌లోనే ఎక్కువగా బట్టలు, గిన్నెల పనులు చేస్తుంటారు. అలాంటప్పుడు ఒక చేత్తో పైప్‌ పట్టుకుని గిన్నెలు కడటం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి కష్టానికి చెక్‌ పెడుతూ ఈ బామ్మ సూపర్‌ ఐడియా అమలు చేసింది. గిన్నెలు కడిగేందుకు వీలుగా తలపై నుండి నేరుగా పైప్‌ పెట్టుకుని ఒక హెయిర్‌ క్లిప్‌తో తన జుట్టుకు బిగించేసింది. ఆ తర్వాత వాటర్ టాప్ కింద గిన్నెలు, గ్లాసులు ఎంతో సులువుగా కడిగేసింది.

 

View this post on Instagram

 

A post shared by Kancђan Verϻⱥ (@kv_udaan)

ఈ స్మార్ట్ కిచెన్ హ్యాక్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో techzany అనే పేజీలో షేర్ చేయబడింది. ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షలాది వ్యూస్‌ (views), వేలాది లైకులు వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు బామ్మగారి ఐడియాకు ఫిదా అయిపోతున్నారు. హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ ముఖ్యం అనడానికి ఈ బామ్మగారే నిదర్శనం అని ఒకరు కామెంట్ చేయగా, ఇకపై మా ఇంట్లో కూడా ఇదే ట్రిక్ ఫాలో అవుతాం అని మరికొందరు గృహిణులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్‌ న్యూస్‌ కోసం క్లిక్ చేయండి..