
- మధిర నియోజకవర్గానికి రూ.131 కోట్లకు అనుమతులు
హైదరాబాద్ , వెలుగు: ఇందిర మహిళ శక్తి స్కీమ్‌లో భాగంగా పాడిగేదెల కొనుగోలు, వాటి రవాణా నిధుల విడుదలకు ప్రభుత్వం అడ్మినిస్ర్టేటివ్ సాంక్షన్ ఇచ్చింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో స్కీమ్‌లో అమలుకు రూ.131.20 కోట్లకు పరిపాలన అనుమతులు ఇస్తూ బీసీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ బాలమాయదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం జీవో 79ని విడుదల చేశారు. 2026– 27 ఫైనాన్సియల్ ఇయర్‌కు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు.