Reading Time: < 1 minute

మోనాలిసాకు రక్షణ కల్పించండి: కిడ్నాప్ కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పు

Caption of Image.

తిరువనంతపురం: కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసాకు కేరళ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. మోనాలిసాకు రక్షణ కల్పించాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఎర్నాకులం ఎస్‎హెచ్‎ఓకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అసలేం జరిగిందంటే..?

ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో పూసలు అమ్ముతూ తన క్యూట్ లుక్స్‎తో ఓవర్ నైట్ స్టార్‎గా మారిన మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‎ను లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, తన కూతురు మైనర్ అని.. ఫర్మాన్ ఆమెను ప్రలోభ పెట్టి పెళ్లి చేసుకున్నాడని మోనాలిసా తల్లిదండ్రులు మధ్యప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోనాలిసా పేరెంట్స్ ఫిర్యాదు మేరకు ఫర్మాన్ ఖాన్‎పై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మోనాలిసా దంపతులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. 

తమను చంపేస్తామని కొందరు ఫోన్లలో బెదిరిస్తున్నారని.. మాకు రక్షణ కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. శనివారం (జూన్ 20) కీలక తీర్పు వెలువరించింది. మోనాలిసా అభ్యర్థనతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఆమెకు రక్షణ కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను జూలై 10వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

 

©️ VIL Media Pvt Ltd.