
TG20 Anthem: తెలంగాణ మట్టిలో పుట్టిన కుర్రాళ్లు, గల్లీల్లో సిక్సర్లు బాదే లోకల్ టాలెంట్ ఇకపై నేరుగా గ్లోబల్ స్టేజ్ వైపు అడుగులు వేయబోతున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న టీజీ20 (TG20) లీగ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని టాలెంట్ ఉన్న కుర్రాళ్లని వెతికి పట్టుకునే పనిలో పడింది. ఈ టోర్నమెంట్‌కు యూత్ ఐకాన్, మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంట్రీ ఇవ్వడంతో లీగ్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
విజయ్ దేవరకొండ ఎమోషన్:
ఈ లీగ్ సాంగ్‌ను పోస్ట్ చేస్తూ విజయ్ దేవరకొండ ఎక్స్ వేదికగా రాసిన మాటలు ప్రతి తెలుగు వాడి గుండెకు హత్తుకునేలా ఉన్నాయి. భారతదేశం తరపున ఒక తెలుగు ప్లేయర్ మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ నాకు గర్వంగా అనిపించేది, ఈ రోజుకీ అలాగే అనిపిస్తుంది. అందుకే టీజీ20 చేయడం చాలా ముఖ్యం.. అందుకే ఈ TG20 ని మీ ముందుకు తీసుకురావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.. మరెంతో మంది కుర్రాళ్లు తమ కలను సాకారం చేసుకోవడం, మన గడ్డ నుంచి ఎందరో తారలు ఎదగడం చూడటానికి నేను వేచి ఉన్నాను అని పేర్కొన్నాడు.
►ALSO READ | విరాట్ కోహ్లీ రీఎంట్రీ.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు తుది జట్టు ఇదే!
అదిరిపోయిన ఆంథెమ్ సాంగ్:
శ్రీనిధి యూనివర్శిటీ టీజీ20 (Sreenidhi University TG20) అధికారిక క్రికెట్ ఆంథమ్ సాంగ్ ‘తెలంగాణ, మానా క్రికెట్ షురూ’ (Telangana, Mana Cricket Shuru!).. ఈ పాటలో రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ నటించారు. ఈ ప్రమోషనల్ సాంగ్ తెలంగాణ నేటివిటీని ప్రతిబింబిస్తూ, క్రికెట్ ఆడే ప్రతి కుర్రాడిలో జోష్ నింపేలా ఉంది. తెలంగాణ చరిత్ర ప్రతిబింబేలా ఈ అంధమ్ సాంగ్ ని భోలే శావళీ అద్భుతంగా రాసి తానే పాడాడు.
Everytime A Telugu player took the field for India i felt a sense of pride, i still do today.
So it was important to do this.
And it fills me with joy to be a part of and Bring you TG20.Cannot wait to see so many more boys live their dream and so many more stars from our land… pic.twitter.com/9WMElBobEK
— Vijay Deverakonda (@TheDeverakonda) June 21, 2026