
ఒక సాదాసీదా మారుమూల గ్రామం… అక్కడి నుంచి దేశంలోనే అత్యున్నతమైన ‘రాష్ట్రపతి భవన్’ సింహాసనం. వినడానికే ఇది ఒక పవర్‌ఫుల్ సినిమా స్క్రిప్ట్‌లా ఉంది కదూ? . కానీ ఇది నిజజీవితంలో జరిగిన సత్యం. అందుకే, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఈ రియల్ లైఫ్ ఇన్‌స్పైరింగ్ స్టోరీని తెరకెక్కించడానికి రెడీ అయిపోయారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయోపిక్..
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవన ప్రయాణాన్ని ఒక అద్భుతమైన డాక్యుమెంటరీగా అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ మన ముందుకు తీసుకురాబోతోంది. సామాజిక కథాంశాలను గుండెలకు హత్తుకునేలా తీసే స్వాతి చక్రవర్తి భత్కల్ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో అమీర్ నిర్మాణంలో వచ్చిన ‘రుబారు రోష్ని’ (2019)తో అందరినీ కదిలించిన స్వాతి.. ఇప్పుడు మరోసారి తన సెన్సిటివ్ మేకింగ్‌తో మ్యాజిక్ చేయబోతున్నారు.
పల్లె టూ ఢిల్లీ ప్యాలెస్..
ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా, ఉపర్‌బేడ అనే ఒక చిన్న గిరిజన గ్రామంలో సంతాల్ కుటుంబంలో జన్మించారు ద్రౌపది ముర్ము. భారతదేశపు మొదటి గిరిజన మహిళా రాష్ట్రపతిగా, దేశంలోనే రెండో మహిళా ప్రెసిడెంట్‌గా ఆమె సృష్టించిన హిస్టరీ మామూలైనది కాదు. ఎన్నో సామాజిక వివక్షలు, అడ్డంకులను దాటుకుని ఆమె సాగించిన ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఎంతో స్పూర్తిదాయకంగా ఉంటుంది.
►ALSO READ | Vanda Devullu Review: అమ్మ పెళ్లి చుట్టూ తిరిగే ఎమోషనల్ మైండ్ గేమ్.. విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’ సినిమా ఎలా ఉందంటే?
ట్విస్టులు, గుండెల్ని పిండేసే ట్రాజెడీలు..
కేవలం పొలిటికల్ మైల్‌స్టోన్స్ మాత్రమే కాదు.. ఈ బయోపిక్‌లో ద్రౌపది ముర్ము వ్యక్తిగత జీవితంలోని చీకటి రోజులను కూడా చూపించబోతున్నారు. భర్త, ఇద్దరు కొడుకులను కోల్పోయి.. గుండె నిండా తీరని శోకం ఉన్నా, కుంగిపోకుండా సమాజ సేవకే అంకితమైన ఒక తల్లి ధైర్యాన్ని ఇందులో ఆవిష్కరిస్తున్నారు.
రియల్ లొకేషన్స్..
ద్రౌపది ముర్ము సొంత ఊరిలోనే మేజర్ పార్ట్ షూటింగ్ జరిపారు. ఆమె చిన్ననాటి పాత్రల కోసం స్థానిక ఒడిశా నటీనటులనే ఎంపిక చేసి రియలిస్టిక్ లుక్ తెచ్చారు. ఈ చిత్రం పాత ఆర్కైవ్స్, రియల్ విజువల్స్, డ్రామా సీక్వెన్స్‌ల కలయికతో ఒక గ్రిప్పింగ్ ఎమోషనల్ రైడ్‌లా ఉండబోతోంది. ఈ సినిమా కేవలం ఒక లీడర్ బయోగ్రఫీ మాత్రమే కాదు.. వెనుకబడిన వర్గాల ఆశల దీపం. త్వరలోనే టైటిల్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. అమీర్ ఖాన్ బ్రాండ్ వాల్యూ తోడవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌పై అప్పుడే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు మొదలయ్యాయి..