Reading Time: < 1 minute

నెయ్‌మార్ ఆడతాడా లేదా?.. కోట్లాది ఫ్యాన్స్ ప్రశ్నకు బ్రెజిల్ సమాధానం ఇదే!

Caption of Image.

Neymar Injury: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) మెగా టోర్నీలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. పిక్క గాయం (Calf Injury)తో బాధపడుతున్న బ్రెజిల్ లెజెండరీ ఫుట్‌బాలర్ నెయ్‌మార్ (Neymar), శుక్రవారం ఫిలడెల్ఫియా వేదికగా హైతీతో జరగబోయే జట్టు రెండో గ్రూప్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. టోర్నీ నాకౌట్ దశలో నెయ్‌మార్ సేవలు అత్యంత కీలకం కానుండగా.. అతని గాయంపై బ్రెజిల్ మేనేజ్‌మెంట్ ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని నిర్ణయించుకుంది.

న్యూజెర్సీలోనే నెయ్‌మార్ రిహాబ్: 
బ్రెజిలియన్ సాకర్ కాన్ఫెడరేషన్ (CBF) అధికారిక ప్రకటనలో.. నెయ్‌మార్ జట్టుతో కలిసి ఫిలడెల్ఫియాకు ప్రయాణించడం లేదు.. అతను న్యూజెర్సీలోనే ఉంటూ అక్కడి ‘ది రిడ్జ్’ హోటల్, కొలంబియా పార్క్ ట్రైనింగ్ సెంటర్‌లో తన రికవరీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. గత మే 17న శాంటోస్ (Santos) క్లబ్ తరఫున ఆడుతున్న సమయంలో నెయ్‌మార్ గాయపడ్డాడు. కానీ, ప్రస్తుతం అతని రికవరీ పర్ఫెక్ట్‌గానే సాగుతోందని మేనేజ్‌మెంట్ చెప్పుకొచ్చింది. 

గ్రౌండ్ లోకి వచ్చి రావడంతోనే గాయం: 
బుధవారం (జూన్ 17న) జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో నెయ్‌మార్ గాయం తర్వాత మొదటిసారి గ్రౌండ్‌లోకి వచ్చి తన సహచరులతో కలిసి కొన్ని లైట్ డ్రిల్స్ చేయడం ఫ్యాన్స్‌కు కాస్త రిలీఫ్ కలిగించే విషయమే. బ్రెజిల్ తరఫున 79 అంతర్జాతీయ గోల్స్‌తో ఆల్-టైమ్ టాప్ స్కోరర్‌గా ఉన్న నెయ్‌మార్, దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చినా గాయంతో బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది.

మొదటి విజయంపై బ్రెజిల్ కన్ను: 
ఈ వరల్డ్ కప్‌లో బ్రెజిల్ జర్నీ ఆశించిన స్థాయిలో స్టార్ట్ అవ్వలేదు. తమ మొదటి గ్రూప్ మ్యాచ్‌లో మొరాకోతో జరిగిన మ్యాచ్ డ్రా (Draw) చేసుకోవడంతో బ్రెజిల్ కేవలం ఒక్క పాయింట్‌తోనే సరిపెట్టుకుంది. గ్రూప్-సీలో నిలదొక్కుకోవాలంటే హైతీపై బ్రెజిల్ కచ్చితంగా గెలవాల్సిందే. స్కాట్లాండ్ చేతిలో ఓడిపోయి గ్రూప్ టేబుల్‌లో చివరి స్థానంలో ఉన్న హైతీపై నెయ్‌మార్ లేకపోయినప్పటికీ బ్రెజిల్ ఈజీగానే గెలుస్తుందని ఫుట్‌బాల్ విశ్లేషకులు భావిస్తున్నారు. బ్రెజిల్ టీమ్ తమ కెప్టెన్ లేని లోటును పూడ్చి టోర్నీలో ఫస్ట్ విక్టరీ నమోదు చేస్తుందో లేదో అనేది చూడాలి మరీ.

©️ VIL Media Pvt Ltd.