Reading Time: 2 minutes

ఈ క్షణం కోసం ఎంతో కష్టపడ్డా.. ఫిఫా ప్రదర్శన తర్వాత నోరా ఫతేహి ఎమోషనల్ పోస్ట్! 

Caption of Image.

Nora Fatehi Emotional Note: బాలీవుడ్ స్టార్ డ్యాన్సర్, నటి నోరా ఫతేహి (Nora Fatehi) కెరీర్‌లో మరో మైండ్ బ్లోయింగ్ మైల్‌స్టోన్‌ను అందుకుంది. ఫిఫా ప్రపంచకప్ 2026 ఓపెనింగ్ సెర్మనీలో తన అదిరిపోయే డాన్స్ పర్‌ఫార్మెన్స్‌తో ఈ ప్రపంచాన్ని ఊపేసింది. కానీ, ఈ స్టేజ్ పై డాన్స్ చేయడం ఎంత స్పెషలో.. ఆ పర్ఫార్మెన్స్ ముగిసిన తర్వాత బ్యాక్‌స్టేజ్‌లో జరిగిన ఒక సీన్ ఆమె లైఫ్‌లోనే మరచిపోలేని మధురమైన క్షణంగా మిగిలిపోయింది. ఈ సందర్భంగా నోరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫస్ట్ టైమ్ ఒంటరితనాన్ని వీడాను: 
నోరా ఫతేహి తన ఇన్‌స్టా పోస్ట్‌లో ఎమోషనల్ పెడుతూ.. తాను ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లకు పైగా అవుతోందని, కెరీర్‌లో ఎన్నో పెద్ద పెద్ద సక్సెస్‌లు చూశానని పేర్కొంది. కానీ, సాధారణంగా తానెప్పుడూ షూటింగ్‌లకు, పర్ఫార్మెన్స్‌లకు ఒంటరిగానే వెళ్లేదాన్ని, వర్క్ ముగిశాక మళ్లీ ఒంటరిగానే ఇంటికి వచ్చేదాన్ని అని చెప్పుకొచ్చింది. తన సక్సెస్‌ను లైవ్‌గా చూసి, అక్కడికక్కడే అభినందించేందుకు తన కుటుంబ సభ్యులు గానీ, క్లోజ్ ఫ్రెండ్స్ గానీ ఎప్పుడూ తన పక్కన లేరనే ఒక చిన్న బాధ ఆమెలో ఉండేదట.

స్టేజ్ దిగగానే కన్నీళ్లు పెట్టుకున్న నోరా: 
కానీ, ఈ ఫిఫా వరల్డ్ కప్ 2026 స్టేజ్ మాత్రం ఆమెకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చింది. నోరా ఫతేహి తన లైవ్ పర్ఫార్మెన్స్ ముగించుకుని స్టేజ్ దిగి వెనుకకు రాగానే.. అక్కడ ఆమె కోసం ఎదురుచూస్తున్న తన ఫ్యామిలీ, ఆత్మీయులు ఒక్కసారిగా ఆమెను గట్టిగా హగ్ చేసుకుని అభినందించారు. ఆ క్షణంలో తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోయానని, జీవితాంతం ఇలాంటి ఒక మూమెంట్ కోసమే తాను కష్టపడ్డానని, ఇదొక కల నిజమైనట్లు ఉందని నోరా ఎమోషనల్ అయింది.

ALSO READ : 100వ మ్యాచ్‌లో జుగ్‌రాజ్ సింగ్ గోల్..

లైవ్‌లో చూసిన అమ్మ.. హాజరైన హైస్కూల్ టీచర్: 
నోరా ఫతేహి కెరీర్ మొత్తంలో ఆమె లైవ్ పర్ఫార్మెన్స్‌ను చూడటానికి ఆమె తల్లి, సోదరి, సోదరుడు రావడం ఇదే మొదటిసారి అట! అంతేకాదు, కెనడా నుంచి ఆమె హైస్కూల్ టీచర్, చిన్ననాటి స్నేహితులు కూడా ఈ ఓపెనింగ్ సెర్మనీకి వచ్చి నోరాను లైవ్‌గా చూసి సపోర్ట్ చేశారు. కొంతమంది ముఖ్యమైన వాళ్ళు ఈ టైమ్‌లో మిస్ అయ్యారనే ఫీలింగ్ ఉన్నప్పటికీ.. తన వాళ్లందరూ ఒకే చోట చేరి తన సక్సెస్‌ను సెలబ్రేట్ చేయడంపై నోరా ఫతేహి గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతోంది.

©️ VIL Media Pvt Ltd.