Reading Time: < 1 minute

కోహ్లీ వస్తే గిల్ ఓపెనర్.. టాప్ ఆర్డర్ కోసం జైస్వాల్కు పోరాడాల్సిందే.. ఇవాళ (జూన్ 20)అఫ్గానిస్తాన్‌‌తో మూడో వన్డే

Caption of Image.
  • క్లీన్ స్వీప్పై ఇండియా గురి    
  • జైస్వాల్‌‌, రాహుల్‌‌, హర్షిత్‌‌ రాణాపైనే దృష్టి
  • మ. 1.30 నుంచి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌లో లైవ్‌‌

చెన్నై: వన్డే వరల్డ్‌‌ కప్‌‌ సన్నాహాల్లో ఉన్న టీమిండియా.. అఫ్గానిస్తాన్‌‌తో వన్డే సిరీస్‌‌ క్లీన్‌‌స్వీప్‌‌పై గురి పెట్టింది. ఈ నేపథ్యంలో శనివారం జరిగే ఈ పోరులో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఓపెనర్‌‌ యశస్వి జైస్వాల్‌‌, కేఎల్‌‌ రాహుల్‌‌ బ్యాటింగ్‌‌ ఫామ్‌‌పై అందరి దృష్టీ నెలకొంది.

వన్డే జట్టులో రాహుల్‌‌ ప్లేస్‌‌కు ఢోకా లేకపోయినా.. ఇప్పటికే తీవ్ర పోటీ ఉన్న టాప్‌‌ ఆర్డర్‌‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి జైస్వాల్‌‌ మాత్రం భారీ ఇన్నింగ్స్‌‌ ఆడాల్సి ఉంది. జైస్వాల్‌‌ కోసం కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ ఓపెనింగ్‌‌ ప్లేస్‌‌ను వదిలి మూడో నంబర్‌‌లో బ్యాటింగ్‌‌కు దిగాడు. అయితే కోహ్లీ వస్తే మాత్రం గిల్‌‌ మళ్లీ ఓపెనర్‌‌గా వెళ్తాడు. ఇషాన్‌‌, శ్రేయస్‌‌ నాలుగైదు ప్లేస్‌‌ల్లో స్థిరపడితే జైస్వాల్‌‌కు అవకాశాలు మరింత తగ్గుతాయి.

రాహుల్‌‌ పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. శ్రేయస్‌‌ రాకతో రాహుల్‌‌ ఆరో ప్లేస్‌‌లో బ్యాటింగ్‌‌ చేయాల్సి వస్తోంది. ఈ స్థానంలో అతని బ్యాటింగ్ రికార్డు అంతగా బాగాలేదు. దీన్ని మెరుగుపర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. పేసర్‌‌ హర్షిత్‌‌ రాణా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అర్ష్‌‌దీప్‌‌ ప్లేస్‌‌లో అతను టీమ్‌‌లోకి వచ్చే చాన్స్‌‌ ఉంది. నితీశ్‌‌ రెడ్డి గాయంతో అందుబాటులో లేకపోవడంతో రాణా బ్యాటింగ్‌‌ బాధ్యతను కూడా చేపట్టాల్సి ఉంటుంది.

పేసర్‌‌ గుర్నూర్ బ్రార్‌‌ను మరికొన్ని మ్యాచ్‌‌ల్లో పరీక్షించాలని మేనేజ్‌‌మెంట్ భావిస్తోంది. మరోవైపు ఈ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌‌లలో పూర్తిగా చతికిలబడిన అఫ్గానిస్తాన్‌‌ జట్టు, చివరి మ్యాచ్‌‌లోనైనా గట్టి పోటీ ఇచ్చి గౌరవప్రదంగా సిరీస్‌‌ను ముగించాలని చూస్తోంది. వైట్ బాల్ క్రికెట్‌‌లో మంచి గుర్తింపు ఉన్న అఫ్గన్‌‌ ఆటగాళ్లు, ఈ సిరీస్‌‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. కనీసం చివరి వన్డేలోనైనా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు.

©️ VIL Media Pvt Ltd.