Reading Time: 2 minutes
అందరూ అడుగుతున్నారు.. నేను కావాలని చేయలేదు..! సరిగ్గా తిండి కూడా తినలేదు.. సమంత ఎమోషనల్ కామెంట్స్

స్టార్ హీరోయిన్ సమంతకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సొంతం చేసుకోవడంతో పాటు రెమ్యునరేషన్ కూడా అందుకుంటుంది. ఏమాయచేశావే సినిమాతో పరిచయం అయిన సామ్ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది సామ్. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్జ్ లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి ఆకట్టుకుంది. అలాగే తమిళ్ లోనూ సినిమాలు చేసి మెప్పించింది. ఇక సామ్ వ్యక్తిగత జీవితం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామ్ ముందు అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ఆ తర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు.

నాగ చైతన్య, సామ్ విడకులు అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇక విడిపోయిన తర్వాత ఇద్దరూ మరొకరిని పెళ్లి చేసుకున్నారు. అలాగే ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. సమంత ఇటీవలే నిర్మాతను రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. పెళ్లి తర్వాత హ్యాపీలైఫ్ లీడ్ చేస్తుంది సామ్. సమంత ప్రస్తుతం తిరిగి సినిమాల పై దృష్టి పెట్టింది. ఇప్పుడు నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా నేడు (19న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా సమంత తన డైట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. సమంత లుక్ పై గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై సామ్ మాట్లాడుతూ.. మయోసైటిస్ వల్ల తాను భోజనం  విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. అలాగే నచ్చింది తింటే తన ఇమ్యూనిటీ పై చాలా ప్రభావం చూపిందని తెలిపింది సమంత. చాలామంది నన్ను ఎప్పుడూ ఒకటే అడుగుతుంటారు. అంత స్లిమ్ గా ఎలా మారారు.? ఎందుకు అంత బరువు తగ్గిపోయారు అని అడుగుతుంటారు. అవతలి వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికీ పూర్తిగా తెలియదు. నేను కావాలని డైట్ చేయలేదు.. కావాలని బరువు తగ్గలేదు.. నాకు తినాలని ఉన్నా కూడా తినలేకపోయా..ఆ రెండేళ్లు నరకంగా అనిపించింది. ప్రస్తుతం తాను కోలుకున్నానని, ఇప్పుడు నచ్చిన ఫుడ్ తింటున్నా కానీ అతిగా ఏది తీసుకోవడం లేదు అని తెలిపింది సమంత. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి