Reading Time: < 1 minute

ఎర్రచందనం నేపథ్యంలో ధనుష్ ఓం

Caption of Image.

ధనుష్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ‘ఓం’.  ‘అమరన్’ ఫేమ్ రాజ్‌‌‌‌కుమార్  పెరియసామి దర్శకత్వం వహిస్తున్నాడు. వండర్‌‌‌‌‌‌‌‌బార్ ఫిలింస్, ఆర్‌‌‌‌‌‌‌‌టేక్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఎర్రచందనం బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు టీజర్‌‌‌‌‌‌‌‌ ద్వారా రివీల్ చేశారు. 

ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారిని కాపాడటానికి వచ్చిన ధనుష్​ పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ లుక్‌‌‌‌లో కనిపించాడు.  ‘ఓం – చాప్టర్ 1: ది బ్లడ్ వుడ్’ అంటూ ఈ టైటిల్‌‌‌‌ను అనౌన్స్ చేసి, రెండు భాగాలుగా ఈ చిత్రం రాబోతోందని రివీల్ చేశారు. 

మమ్ముట్టి  కీలక పాత్ర పోషిస్తున్న ఈ  చిత్రంలో  సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 16న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా సినిమా విడుదల కానుంది.

©️ VIL Media Pvt Ltd.