
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలల తరబడి సాగుతోన్న యుద్ధాన్ని ముగించడమే లక్ష్యంగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు జరుపుతున్నాయి. ఆదివారం (జూన్ 21) స్విట్జర్లాండ్ వేదికగా ఇరుదేశాల మధ్య తుది దశ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా తరుఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి స్టీట్ విట్ కాఫ్, ప్రెసిడెంట్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ హాజరయ్యారు.
ఇరాన్ తరుఫున స్పీకర్ మహ్మమద్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అటెండ్ అయ్యారు. మధ్యవర్తులుగా పాకిస్తాన్, ఖతార్ ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈ చర్చలకు ముందు అమెరికా, ఇరాన్ బృందాలు పాక్ డెలిగేషన్‌తో సమావేశమయ్యాయి. పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ తో ఇరుదేశాల ప్రతినిధులు భేటీ అయ్యి చర్చించారు.
ఇరాన్, అమెరికా మధ్య చర్చలు సఫలమై పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ఎండ్ కార్డ్ పడుతుందా..? లేక మిడిల్ ఈస్ట్ మళ్లీ మిస్సైళ్లు, బాంబుల మోతతో దద్దరిల్లితుందా అనేది చూడాలీ. ఒకవేళ చర్చలు విఫలమై ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై బాంబల వర్షం కురిపిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్విట్లర్లాండ్ లో ఇరాన్, అమెరికా భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
►ALSO READ | ఫన్నీ ట్రంప్.. జీ7 వేదికపై నేనే బాస్ అని ..సరదాగా అన్నానని వివరణ
అమెరికా, ఇరాన్ మధ్య ఈ వారంలో ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఎంవోయూపై సంతకాలు కూడా చేశారు. ప్రాథమిక ఒప్పందంలోని అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడమే లక్ష్యంగా అమెరికా, ఇరాన్ బృందాలు స్విట్జర్లాండ్‌లో చర్చలు జరుపుతున్నాయి. ప్రాథమిక ఒప్పందంలోని అంశాలకు ఇరుదేశాలు అంగీకరిస్తే నెలల తరబడి సాగుతోన్న పశ్చిమాసియా యుద్ధానికి తెరపడనుంది.