Reading Time: < 1 minute
Fifa World Cup 2026 Mexico Becomes First Team To Qualify For Knockout Stage After Win Over South Korea

FIFA World Cup 2026 Mexico: ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆతిథ్య దేశమైన మెక్సికో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తుంది. టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన మెక్సికో, నాకౌట్ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా మెక్సికో నిలిచింది. గ్రూప్-Aలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించి నాకౌట్‌ దశకు చేరుకుంది.

టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన మెక్సికో.. నేడు దక్షిణ కొరియాను కూడా ఓడించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల్లో ఆరు పాయింట్లు సాధించిన మెక్సికో గ్రూప్‌లో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో మెక్సికో తరఫున లూయిస్ రోమో 50వ నిమిషంలో ఏకైక గోల్ నమోదు చేశాడు. ఆ గోల్‌తో మెక్సికో ఆధిక్యంలోకి వెళ్లగా.. మ్యాచ్ ముగిసే వరకు ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. దక్షిణ కొరియా పలుమార్లు సమం చేసే అవకాశాలను సృష్టించినప్పటికీ, మెక్సికో గోల్‌కీపర్ రాంగెల్ అద్భుతమైన సేవ్‌ లతో జట్టును కాపాడాడు.

ప్రస్తుతం గ్రూప్-A పట్టికలో మెక్సికో ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణ కొరియా మూడు పాయింట్లతో రెండో స్థానంలో, చెక్ రిపబ్లిక్ మూడో స్థానంలో, దక్షిణాఫ్రికా నాలుగో స్థానంలో ఉన్నాయి. స్వదేశీ అభిమానుల మద్దతుతో మెక్సికో మరో కీలక విజయాన్ని అందుకుని ప్రపంచకప్‌లో టైటిల్ రేసులో తన సత్తాను చాటుతోంది. నాకౌట్ దశలో కూడా ఇదే జోరు కొనసాగిస్తుందో లేదో చూడాలి మరి.