
పవన్ తాతా, చమింద వర్మ జంటగా రాజేష్ రావూరి దర్శకత్వంలో శివ మల్లాల నిర్మిస్తున్న చిత్రం ‘హ్రీం’. తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, బెనర్జీ, భద్రమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారర్, మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి శనివారం టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌కు అతిథులుగా హాజరైన దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుతూ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. పవన్ తాతా మాట్లాడుతూ ‘ఇందులో లవ్, ఎమోషన్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. పెర్ఫార్మెన్స్‌కు మంచి స్కోప్ ఉన్న కథ ఇది. సీనియర్ యాక్టర్స్‌తో నటించడంతో నా యాక్టింగ్ స్కిల్స్ మెరుగయ్యాయి’ అని చెప్పాడు.
ఇదొక యూనిక్ కాన్సెప్ట్ ఫిల్మ్ అని హీరోయిన్ చమింద వర్మ చెప్పింది. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుందని డైరెక్టర్ రాజేష్ రావూరి అన్నాడు. ప్రొడ్యూసర్ శివ మల్లాల మాట్లాడుతూ ‘డైరెక్టర్ రాజేష్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. టీమ్ అంతా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ చిత్రంలో 20 నిమిషాల గ్రాఫిక్స్ కూడా ఉంటుంది. హీరోయిన్ చమింద వర్మ, పవన్ తాతా ప్యాషన్‌తో నటించారు. అన్ని ఎలిమెంట్స్‌తో ప్రతి ఒక్కరికీ నచ్చేలా సినిమా ఉంటుంది’ అని అన్నారు. నటులు రాజీవ్ కనకాల, బెనర్జీ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.