
పాలకవీడు, వెలుగు : భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రజల్లో ఆయనకున్న అభిమానం, రాజకీయంగా సాధించిన విజయాలపై సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాలోత్ మోతిలాల్ రూపొందించిన ఆడియో సాంగ్ ను శుక్రవారం మంత్రి ఉత్తమ్ తన స్వగృహంలో విడుదల చేశారు.
ఈ పాటను నల్లగొండ గద్దర్ గా పేరుగాంచిన నర్సిరెడ్డి పాడారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మోతిలాల్ మాట్లాడుతూ ఈనెల 20న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బర్త్డే సందర్భంగా తన ఆర్థిక సహకారంతో రూపొందించిన ఈ ఆడియో సాంగ్ మంత్రి చేతుల మీదుగా విడుదల చేయించడం తనకు సంతోషంగా ఉందన్నారు.
ఈ ఆడియో సాంగ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదరణ పొందేలా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. మంత్రి ఉత్తమ్ కు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ అన్నపురెడ్డి అప్పిరెడ్డి, రాష్ట్ర నాయకులు చలసాని రాజీవ్ చక్రధర్ రావు, మండల ఎన్ ఎస్ యూఐ అధ్యక్షులు సందీప్ రెడ్డి, ఉపేందర్, నాగరాజు తదితరులు ఉన్నారు.