Reading Time: < 1 minute

తెల్లారితే నీట్ ఎగ్జామ్.. ఒత్తిడి తట్టుకోలేక హైదరాబాద్‎లో యువతి సూసైడ్

Caption of Image.

హైదరాబాద్: పరీక్షల ఒత్తిడికి మరో ప్రాణం పోయింది. నీట్ ఎగ్జామ్ ఒత్తిడి తట్టుకోలేక ఓ యువతి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‎లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‏లోని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన జాఫర్ హుసేన్ కుటుంబం హైదరాబాద్‎లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్పన అపార్ట్మెంట్‎లో నివాసం ఉంటున్నారు. 

జాఫర్ ప్రస్తుతం కువైట్‎లో ఉంటున్నాడు. వీరికి సనా అనే కూతురు ఉంది. సనా నీట్ ఎగ్జామ్‏కు ప్రిపేర్ అవుతుంది. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంది. అయితే, పరీక్ష ఒత్తిడి తట్టుకోలేక శనివారం (జూన్ 20) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‎కి చున్నీతో ఉరి వేసుకుని సనా ఆత్మహత్యకు పాల్పడింది.

తన ఆత్మహత్యకు ఎవరు కారణం కాదని.. కుటుంబ అంచనాలు అందుకోలేక చనిపోతున్నట్లు సూసైడ్ నోట్‎లో పేర్కొంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‎కు తరలించారు. తెల్లారితే ఎగ్జామ్ ఉండగా.. పరీక్ష ఒత్తిడి తట్టుకోలేక కూతురు తనువు చాలించడంతో సనా తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) 2026, మే 3న నీట్ యూజీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, క్వశ్చన్ పేపర్ లీక్ ఆరోపణలతో ఎన్టీఏ పరీక్షను రద్దు చేసింది. 2026, జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించనుంది.  

©️ VIL Media Pvt Ltd.