Reading Time: 2 minutes

గ్యాంగ్ వార్స్, పేదరికం, ఐదేళ్లు దేశానికి దూరం.. 52 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్‌లో హైతీ అద్భుతం!

Caption of Image.

Haiti Football Team: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) మెగా టోర్నీలో ఎన్నో అద్భుతమైన కథనాలు ఉన్నాయి. ఈసారి క్యూరాసావో, కేప్ వెర్డే వంటి చిన్న దేశాలు తొలిసారి వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయి చరిత్ర సృష్టించాయి. కానీ, వీటన్నింటికంటే అత్యంత స్ఫూర్తిదాయకమైన కథ హైతీ (Haiti) ఫుట్ బాల్ జట్టుదే. సొంత దేశంలో తీవ్రమైన రాజకీయ, తీవ్ర సంక్షోభం, పేదరికం తాండవిస్తున్నా.. వాటన్నింటినీ తట్టుకుని ఈ కరిబియన్ దేశం ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది. ఈరోజే (జూన్ 19, శుక్రవారం) ఫిలడెల్ఫియాలోని లింకన్ ఫైనాన్షియల్ ఫీల్డ్‌లో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన బలమైన బ్రెజిల్ జట్టుతో హైతీ తలపడబోతోంది.

ఆరు దేశాల ప్లేయర్లతో హైతీ జట్టు:
హైతీ ఫుట్‌బాల్ చరిత్రను 2010లో వచ్చిన ఘోర భూకంపం కోలుకోలేని దెబ్బతీసింది. ఆ ప్రమాదంలో హైతీ ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు చెందిన ఆటగాళ్లు, కోచ్‌లు, వైద్య సిబ్బంది కలిపి మొత్తం 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం వరల్డ్ కప్ ఆడుతున్న 26 మంది సభ్యుల జట్టులో కేవలం 10 మంది మాత్రమే హైతీలో పుట్టారు. మిగిలిన 16 మంది ఆటగాళ్లు ఫ్రాన్స్, యూఎస్ఏ, కెనడా, బెల్జియం, స్లోవేకియా దేశాలకు వలస వెళ్లిన హైతీ సంతతికి చెందినవారే. కోచ్ మిగ్నే చొరవతో వీరంతా ఒకే తాటిపైకి వచ్చి తమ మాతృదేశం కోసం ఆడుతున్నారు.  

►ALSO READ | బ్రెజిల్ జెర్సీలో భారత కొత్త కెప్టెన్ రచ్చ.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్!

బ్రెజిల్‌తో ఢీ కొట్టబోతున్న హైతీ: 
హైతీ దేశానికి ఇది రెండో ప్రపంచకప్ మాత్రమే.. గతంలో 1974లో తొలిసారి ఆడినప్పుడు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఈ 2026 ఎడిషన్ మొదటి మ్యాచ్‌లోనూ స్కాట్లాండ్ చేతిలో 1–0 తేడాతో ఓడిపోయింది. వరల్డ్ కప్ హిస్టరీలో ఇప్పటి వరకు ఒక్క పాయింట్ కూడా సాధించని హైతీ.. ఈరోజు బ్రెజిల్‌పై ఎలాగైనా అద్భుతం చేయాలని చూస్తోంది. మొదటి మ్యాచ్‌లో మొరాకోతో డ్రా చేసుకుని ఒత్తిడిలో ఉన్న బ్రెజిల్‌ను హైతీ ఎంతవరకు అడ్డుకుంటుందో అనేది చూడాలి మరీ. 

5 ఏళ్లుగా సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ ఆడని హైతీ: 
* హైతీ దేశంలో 2020 నుంచి గ్యాంగ్ వార్స్ తీవ్రస్థాయికి చేరుకున్నాయి. రాజధాని పోర్ట్-ఓ-ప్రిన్స్‌లోని దాదాపు 90శాతం ప్రాంతం ఈ గ్యాంగ్‌ల కంట్రోల్‌లోనే ఉంది. దీనివల్ల ఆ దేశంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి.

* నూతన రికార్డు: తీవ్రమైన భద్రతా కారణాలతో హైతీ జట్టు గత ఐదేళ్లుగా సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.. తమ హోమ్ మ్యాచ్‌లన్నింటినీ దాదాపు 516 మైళ్ల దూరంలో ఉన్న క్యూరాసావో వేదికగానే ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. 

* రిమోట్ కోచింగ్: ఫ్రాన్స్‌కు చెందిన హెడ్ కోచ్ సెబాస్టియన్ మిగ్నే ఇప్పటి వరకు అసలు హైతీ దేశంలో అడుగుపెట్టనే లేదంటే నమ్మశక్యం అని విషయం.. అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో ఆయన ఫోన్ కాల్స్, ఆన్‌లైన్ ద్వారానే ఆటగాళ్లను కాంటాక్ట్ చేస్తూ రిమోట్‌గా టీమ్‌ను గైడ్ చేసి వరల్డ్ కప్‌కు క్వాలిఫై చేయడం ఒక మిరాకిల్ అనే చెప్పాలి.
 

©️ VIL Media Pvt Ltd.