
తెలుగు సినిమా స్వర్ణయుగంలో తమదైన నటనతో, మాటతీరుతో, విలక్షణమైననటనతో ప్రేక్షకులను అలరించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ రమణారెడ్డి. తన కామెడీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు ఆయన.సీనియర్ దర్శకుడు నందం హరిశ్చంద్ర రావు రమణారెడ్డి జీవిత విశేషాలను, సినీ ప్రస్థానాన్ని ఆసక్తికరంగా వివరించారు. నెల్లూరు యాసను తెలుగు సినిమాకు పరిచయం చేసి, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో ఒకే శైలితో ప్రేక్షకులను మెప్పించారు రమణారెడ్డి. 1921లో నెల్లూరు జిల్లా జగదేవిపేటలో తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, కోటమ్మ దంపతులకు జన్మించారు రమణారెడ్డి. ప్రసిద్ధ టీ. సుబ్బరామి రెడ్డి, దర్శకుడు ఎం.ఎస్. కోటారెడ్డి ఆయనకు బంధువులు కావడం విశేషం. చిన్నతనంలోనే నాటకాల పట్ల ఆసక్తి పెంచుకున్న రమణారెడ్డి, నెల్లూరులో చదువుతున్న రోజుల్లో కన్యాశుల్కం నాటకంలో ఒక పాత్రతో తొలిసారి రంగస్థలంపై అడుగుపెట్టారు. ఆ తర్వాత ప్రఖ్యాత మోనో యాక్టర్ చంద్రశేఖర్ వద్ద మోనో యాక్టింగ్ నేర్చుకున్నారు.
ఇది కూడా చదవండి : ఆ జబర్దస్త్ నటుడు నన్ను దారుణంగా మోసం చేశాడు.. పిచ్చిపిచ్చిగా తిట్టి, కొట్టి చాలా హింసించారు
రమణారెడ్డి జీవితంలో ఒక మలుపు బెజవాడలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ కోర్సులో చేరడం. అక్కడ గుంటూరు మున్సిపాలిటీలో టీకాలు వేసే ఉద్యోగం కూడా చేశారు. ఈ సమయంలోనే ఒక సినిమా అవకాశం వచ్చినా, తన బావగారు ఉద్యోగం ఇప్పించినందుకు ఆయన తిరస్కరించారు. అయితే, ఆయన స్నేహితుడు కోదండరెడ్డి ప్రోత్సాహంతో, మద్రాస్ వెళ్లి చిత్తూరు నాగయ్య గారిని కలిశారు. నాగయ్య గారు అప్పట్లో త్యాగయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నా, రమణారెడ్డికి శిష్యుడి పాత్రను, అది కూడా బోడి గుండు చేయించుకోవాలని చెప్పడంతో ఆయన నిరాశగా వెనుదిరిగారు. అయితే, ఆయన అదృష్టం తలుపు తట్టింది. ఊహించని రీతిలో సర్వోదయ ఫిలిమ్స్ నుండి మానవతి చిత్రానికి అగ్రిమెంట్, అడ్వాన్సుతో కూడిన కవరు వచ్చింది. అదే సమయంలో కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో దీక్ష, నాదీ ఆడ జన్మే చిత్రాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నారు. మొదట దీక్ష విడుదల కాగా, తర్వాత నాదీ ఆడ జన్మే, ఆపైన మానవతి విడుదలయ్యాయి.
ఇది కూడా చదవండి : అందరూ అడుగుతున్నారు.. నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు.. సమంత ఎమోషనల్ కామెంట్స్
రమణారెడ్డికి పేరు తెచ్చిన చిత్రాలు అనేకం. మిస్సమ్మలో డేవిడ్ పాత్ర, గుండమ్మ కథలో గంటన్న పాత్ర, మాయా బజార్లో శర్మయ్య పాత్ర, రోజులు మారాయిలో విలన్ కర్ణం పాత్ర ఆయన నటనకు మచ్చుతునకలు. ప్రత్యేకించి రోజులు మారాయిలో కర్ణం పాత్ర అంతగా జనంలోకి వెళ్లింది అంటే, ఒక రోజు సినిమా తర్వాత ఓ వృద్ధురాలు ఆయనను పట్టుకుని “దొంగ సచ్చినోడా, నువ్వు ఆ భూములన్నీ ఇచ్చేస్తావా లేదా” అని తిట్టడం అప్పట్లో ఆయన క్యారెక్టర్ సక్సెస్‌కు నిదర్శనం. రమణారెడ్డికి అల్సర్ వ్యాధి ఉండేదని, దానిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించింది. దానితోపాటు సరిపడా ఆహారం తీసుకోకపోవడం, వ్యాధిని నిర్లక్ష్యం చేయడం వల్ల 1974లో ఆయన అకాల మరణం పాలయ్యారు.
ఇది కూడా చదవండి : బాబోయ్..! ఇక్కడెక్కడి సినిమా రా అయ్యా..!! రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి.. ఎక్కడ చూడొచ్చంటే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి