Reading Time: 2 minutes
Giorgia Meloni Hits Back At Donald Trump Popularity Remarks G7 Row

మిత్రదేశాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. నిన్నామొన్నటిదాకా స్నేహితులుగా ఉన్న ట్రంప్-మెలోని మధ్య వైర్యం ముదిరింది. ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ 7 సదస్సులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తనతో ఫొటో దిగేందుకు బతిమాలిందంటూ ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన కాకరేపుతున్నాయి. రెండు దేశాల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. అలాగే ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని అడ్డుకునే విషయంలో అమెరికా వైఖరికి ఆమె మద్దతు ఇవ్వకపోవడం వల్ల ఇటలీలో ఆమె ప్రజాదరణ తగ్గిందని ఆరోపించారు. అమెరికా సైనిక విమానాలకు ఇటలీ రన్‌వేలు, ఎయిర్‌స్ట్రిప్‌ల వినియోగానికి కూడా ఆమె అనుమతి ఇవ్వలేదని ట్రంప్ విమర్శించారు. దీనిపై ఇరు దేశాల అధినేతల మధ్య మాటలు ముదురుతున్నాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మెలోని మరోసారి ఘాటుగా స్పందించారు.

Dke

“అధ్యక్షుడు ట్రంప్.. నాపై మీరు చేస్తున్న ఈ నిరాధార, అనవసర విమర్శలు అర్థరహితమైనవి” అని పేర్కొన్నారు. ట్రంప్ తన ప్రజాదరణ తగ్గిపోతోందని చేసిన వ్యాఖ్యలపై కూడా ఆమె తీవ్రంగా స్పందించారు. “మీతో స్నేహంగా ఉండటం వల్ల నా ప్రజాదరణ పెరగలేదు. అలాగే నా ప్రజాదరణ మీతో ఉన్న సంబంధాలపై ఆధారపడదు. ఇటలీ జాతీయ ప్రయోజనాలను కాపాడగల నా సామర్థ్యంపైనే అది ఆధారపడి ఉంటుంది. నేను ఎప్పుడూ అదే చేశాను” అని మెలోనీ స్పష్టం చేశారు. అమెరికా సైనిక స్థావరాల వినియోగంపై ట్రంప్ చేసిన ఆరోపణలను కూడా ఖండించారు. “ఇటలీలోని అమెరికా సైనిక స్థావరాల వినియోగం పరస్పర ఒప్పందాల ప్రకారం జరుగుతుంది. నేను ప్రధాని ఉన్నంతకాలం ఆ ఒప్పందాలను ఉల్లంఘించలేరు. ఇటలీ ఒక సార్వభౌమ దేశం” అని వ్యాఖ్యానించారు. చివరగా ట్రంప్‌కు కౌంటర్ ఇస్తూ.. “ఏదేమైనా నా ప్రజాదరణ మీకు సంబంధించిన విషయం కాదు. మీ ప్రజాదరణ గురించి మీరు ఆలోచించుకోవడం మంచిది” అని మెలోనీ చురకలు అంటించారు.

ఫొటో కోసం పదేపదే అడిగిందన్న ట్రంప్

జీ7 సదస్సు అనంతరం ట్రూత్ సోషల్ మీడియాలో మెలోనీపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సమావేశంలో తనతో ఫొటో దిగేందుకు మెలోనీ పదేపదే అభ్యర్థించిందని పేర్కొన్నారు. అలాగే ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని అడ్డుకునే విషయంలో అమెరికా వైఖరికి ఆమె మద్దతు ఇవ్వకపోవడం వల్ల ఇటలీలో ఆమె ప్రజాదరణ తగ్గిందని ఆరోపించారు. అమెరికా సైనిక విమానాలకు ఇటలీ రన్‌వేలు, ఎయిర్‌స్ట్రిప్‌ల వినియోగానికి కూడా ఆమె అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. “ఇప్పుడు అమెరికా ఇరాన్‌ను సైనికంగా ఓడించిన తర్వాత మళ్లీ మాతో స్నేహం చేయాలని.. తన రాజకీయ రేటింగ్ పెంచుకోవాలని చూస్తోంది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇటలీ ఎప్పుడూ వేడుకోదు

ఇటాలియన్ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ట్రంప్ అవే వ్యాఖ్యలు చేశారు. “మెలోనీ ఫొటో కోసం బతిమాలింది. ఆమెకు జాలి వేసి ఫొటో దిగాను” అని వ్యాఖ్యానించారు. దీనిపై వెంటనే స్పందించిన మెలోనీ.. “నేను గానీ.. ఇటలీ గానీ ఎప్పుడూ ఎవరినీ వేడుకోదు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి” అని స్పష్టం చేశారు. ఈ తాజా పరిణామాలతో ట్రంప్-మెలోనీ మధ్య వివాదం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.