
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శనివారం ఎస్పీ నరసింహ సందర్శించి, ఎనిమిదో తరగతి విద్యార్థులకు బడిపంతులుగా మారి పాఠాలు బోధించారు. తన పూర్వపు ఉపాధ్యాయ వృత్తిని గుర్తుచేసుకుంటూ ఆయన విద్యార్థులకు ‘ఉత్తరధ్రువం.. దక్షిణధ్రువం’ అనే సాంఘికశాస్త్ర పాఠాన్ని వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన టీచర్లు ఉంటారని, వారు పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తారని తెలిపారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.