
The Paradise: నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise) నుంచి ఒక సరికొత్త అప్‌డేట్ రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌ను ఈరోజు(శుక్రవారం) సాయంత్రం 6:03 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా #JadalZamana అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌తో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ‘దసరా’ వంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో నాని ‘జాడల్’ అనే ఊరమాస్, రగ్గడ్ క్యారెక్టర్‌లో మునుపెన్నడూ లేని వైల్డ్ లుక్‌లో కనిపించబోతున్నారని సమాచారం.
ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, కయాదు లోహార్, రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ణి, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు రాబోయే ఆ క్రేజీ అప్‌డేట్ కోసం సినీ ప్రియులు, నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
from #TheParadise.
Today at 6:03 PM. Stay tuned!#JadalZamana
Natural Star @NameisNani in an @odela_srikanth cinema
An @anirudhofficial musical@themohanbabu @11Lohar @sudhakarcheruk5 @TheRaghav_Juyal @sonalikulkarni @sampoornesh @Dop_Sai @NavinNooli @artkolla… pic.twitter.com/8tRwp7dVBU
— THE PARADISE (@TheParadiseOffl) June 19, 2026
from 
