Reading Time: 2 minutes

మెస్సీకి రెడ్ కార్డ్ ఇవ్వాల్సిందే.. అర్జెంటీనాపై అల్జీరియా కంప్లైంట్.. రంగంలోకి ఫిఫా?

Caption of Image.

Lionel Messi Red Card Row: ఫిఫా ప్రపంచకప్ 2026 మెగా టోర్నీలో అర్జెంటీనా కెప్టెన్, ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) హాట్రిక్ గోల్స్‌తో (3–0 తేడాతో అల్జీరియాపై విజయం) అదిరిపోయే స్టార్ట్ అయితే ఇచ్చాడు కానీ.. మ్యాచ్ ముగిశాక అసలైన లొల్లి మొదలైంది. ఈ మ్యాచ్‌లో రెఫరీ తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అల్జీరియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమైక్య (FIFA) కు అధికారికంగా కంప్లైంట్ చేసింది. ముఖ్యంగా మెస్సీ చేసిన ఒక పౌల్‌కు రెడ్ కార్డ్ ఇవ్వాల్సిందేనని అల్జీరియా పట్టుబడుతోంది.

కాలితో తన్నిన మెస్సీ.. రెఫరీ సైలెంట్‌: 
మ్యాచ్ ఫస్ట్ హాఫ్‌లో అర్జెంటీనా 1–0తో ముందంజలో ఉన్న సమయంలో ఈ వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. బంతి కోసం పోటీ పడుతున్న క్రమంలో మెస్సీ తన బూటును పైకెత్తి అల్జీరియా కెప్టెన్ ఐస్సా మాండి (Aissa Mandi) పిక్కపై వెనుక నుంచి బలంగా తన్నాడు. అల్జీరియా ప్లేయర్లు దీనిపై గట్టిగా అప్పీల్ చేసినప్పటికీ, ఆన్-ఫీల్డ్ రెఫరీ కనీసం ఫౌల్ కూడా ఇవ్వలేదు.. అటు వీడియో అసిస్టెంట్ రెఫరీ (VAR) కూడా దీనిని రివ్యూ చేయలేదు. 

అల్జీరియా ఫుట్‌బాల్ ప్రతినిధి మాట్లాడుతూ.. మా కంప్లైంట్ ముఖ్యంగా మెస్సీ చేసిన ఆ ప్రమాదకరమైన ఫౌల్ గురించే.. దానికి ఖచ్చితంగా డైరెక్ట్ రెడ్ కార్డ్ ఇవ్వాలి.. అర్జెంటీనా మాకంటే బాగా ఆడిందనే విషయాన్ని మేము ఒప్పుకుంటాం, కానీ ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు మేము సైలెంట్‌గా ఉండలేం.. మ్యాచ్‌లో ఇలాంటివి 3 సంఘటనలు జరిగాయి, దేనికీ VAR స్పందించలేదని ఆరోపించారు. అంతేకాదు, సెకండ్ హాఫ్‌లో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ అలెక్సిస్ మెక్ అలిస్టర్.. గాల్లోకి లేచి బంతిని హెడ్ చేసే క్రమంలో అల్జీరియా ప్లేయర్ ఇబ్రహీం మాజాను మోచేత్తో కొట్టాడని, దానికి కూడా రెఫరీ ఫౌల్ ఇవ్వలేదని అల్జీరియా పేర్కొంది. 

ALSO READ : గ్రౌండ్‌లోనే గుక్కపెట్టి ఏడ్చిన టర్కీ ఫుట్బాల్ ప్లేయర్స్

మెస్సీకి ఒక రూల్.. మాకో రూలా?: 
మెస్సీకి రెడ్ కార్డ్ ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఎక్స్‌పర్ట్స్ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. దీనిపై సౌతాఫ్రికా హెడ్ కోచ్ హ్యూగో బ్రూస్ (Hugo Broos) తీవ్రంగా విమర్శించారు. దాదాపు ఇలాంటి ఫౌల్ చేసినందుకే దక్షిణాఫ్రికా జట్టు మిడ్‌ఫీల్డర్ థెంబ జ్వానేపై ఫిఫా మూడు మ్యాచ్‌ల నిషేధం విధించింది. మరీ మెస్సీ విషయంలో జరిగిన దాన్ని చూశాక, మా ప్లేయర్‌కు ఇచ్చిన శిక్షను నేను అస్సలు ఒప్పుకోను.. మెస్సీ లాంటి క్వాలిటీ ప్లేయర్లు గ్రౌండ్‌లోనే ఉండాలి, అందులో డౌట్ లేదు.. కానీ ఒకే రకమైన తప్పుకు ఇద్దరు ప్లేయర్ల మధ్య రెఫరీలు ఇంత వ్యత్యాసం ఎలా చూపిస్తారో నాకు అర్థం కావడం లేదన్నారు. 

©️ VIL Media Pvt Ltd.