Reading Time: < 1 minute

HCAకు ల్యాండ్ ఇప్పించింది మేమే… కాకా చొరవతోనే ఉప్పల్ స్టేడియం వచ్చింది: మంత్రి వివేక్ 

Caption of Image.

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో HCA TG20 లీగ్ పై మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. నెల నుంచి TCA గురవారెడ్డి తప్పుడు ప్రచారం చేస్తూ విశాఖ ఇండస్ట్రీస్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ను స్పాన్సర్ చేసిన వారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి వివేక్. HCAకు ల్యాండ్ ఇప్పించింది తామేనని.. కాకా చొరవతోనే ఉప్పల్ స్టేడియం వచ్చిందని అన్నారు.

గతంలో కూడా నమస్తే తెలంగాణలో HCA లూటీ అని రాస్తే… నోటీసులు ఇచ్చామని అన్నారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు స్టేడియం నిర్మాణానికి డబ్బు, స్థలం ఇప్పించారని.. శివలాల్ యాదవ్ అనేక మందితో, సోనియాను సైతం కలిశారని అన్నారు. IOCL నుంచి సైతం నిధుల సేకరణ కు ట్రై చేసినా సాధ్యం కాలేదని… చివరకు కాకా ను కలిసి.. విశాఖ ఇండస్ట్రీస్ నుంచి స్పాన్సర్ చెయ్యమని కోరారని.. కాకా ఆదేశాలతో స్పాన్సర్ షిప్ ఇచ్చామని అన్నారు.

విశాఖ ఇండస్ట్రీస్ నుంచి నిధులు కూడా ఇచ్చామని.. ఈసీ మీటింగ్, యాన్యువల్ జనరల్ మీటింగ్ లో కూడా ఒప్పుకొని మాతో అగ్రిమెంట్ చేసుకున్నారని అన్నారు. ఐపీఎల్ వచ్చినప్పుడు HCA రైట్స్ ఇవ్వము అంటే… హైకోర్టు విశాఖ ఇండస్ట్రీస్ కే రైట్స్ ఇవ్వాలని చెప్పిందని అన్నారు. వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్లినా అదే తీర్పు వచ్చిందని అన్నారు.

ఆ తర్వాత 2011లో విశాఖ తో అగ్రిమెంట్ ను HCA క్యాన్సిల్ చేసిందని అన్నారు. అగ్రిమెంట్ నిబంధనల ప్రకారమే.. ఆర్బిట్రేటర్ ఆర్డర్ ఇచ్చారని అన్నారు మంత్రి వివేక్.26కోట్ల ఆర్బిట్రేటర్ ఆర్డర్ వచ్చిందని.. 17కోట్లకు ఒప్పుకోమ్మని అంటే.. మేము జాయింట్ మెమోను ఒప్పుకున్నామని అన్నారు మంత్రి వివేక్.

అయితే ఆ ఒప్పందాన్ని వాళ్ళు పూర్తి చెయ్యక.. కమర్షియల్ కోర్టు, హైకోర్టు కు వెళ్ళి.. ఆర్బిట్రేటర్ కు వ్యతిరేకంగా తీర్పు కోసం వెళ్లారని.. చివరకు సుప్రీం కోర్టు కు వెళ్ళినా.. మాకు అనుకూలంగా తీర్పు వచ్చిందని అన్నారు మంత్రి వివేక్.

©️ VIL Media Pvt Ltd.