
కార్మిక శాఖ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామికి సన్మానం చేశారు సైనిక్ ఫౌండేషన్, ప్రైవేట్ ఉద్యోగుల సంఘాలు. శుక్రవారం ( జూన్ 19 ) జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. మన యువతకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని..ATCల ద్వారా యువతను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. గిగ్ వర్కర్లకు హక్కులు కల్పించామని… యువత ఎక్కడ అవకాశాలు ఉన్నా అందిపుచ్చుకోవాలని అన్నారు మంత్రి వివేక్.
టామ్ కామ్ ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని… యువతకు జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నామని అన్నారు. కృషి,పట్టుదల ఉంటే యువత ఏదైనా సాధించవచ్చని… సీఎం ఓవర్సీస్ స్కీంతో యువతకు మరిన్ని ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తామని అన్నారు మంత్రి వివేక్.
►ALSO READ | TG 20 లీగ్ ఆపాలని హైకోర్టును ఆశ్రయించిన తెలంగాణ క్రికెటర్లు
పని చేసే నాయకులను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని… పెద్దపల్లిలో కాకాను, తనను, ఎంపీ వంశీని గెలిపించారని అన్నారు. దశాబ్దాలుగా కాకా కుటుంబం ప్రజలకు ఎంతో సేవ చేస్తోందని అన్నారు మంత్రి వివేక్.