
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన గొప్పమనసును చాటుకున్నారు. శ్రద్ధ అనే తన చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చి అతని కళ్లల్లో ఆనందం నింపారు. వివరాల్లోకి వెళితే.. ప్రాణాంతక వ్యాధులతో పోరాడే చిన్నారుల కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ సంస్థ నెరవేరుస్తుంది. అలా శ్రద్ద కూడా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రద్ధ అల్లు అర్జున్ ను కలవాలనుకుంటోంది. దీంతో మేక్ ఏ విష్ ఫౌండేషన్ ఈ విషయాన్ని అల్లు అర్జున్ కు చేరవేసింది. దీనికి వెంటనే స్పందించిన బన్నీ వెంటనే శ్రద్ధ కు వీడియో కాల్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా పాపతో సరదాగా ముచ్చటించారు అల్లు అర్జున్. ‘పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైరు’ అంటూ పుష్ప సినిమాలో డైలాగ్స్ చెప్పి చిన్నారి కళ్లల్లో ఆనందం నింపారు. అనారోగ్యంతో బాధపడుతోన్న పాప త్వరగా కోలుకోవాలని బన్నీఆకాంక్షించారు. బన్నీనే స్వయంగా వీడియో కాల్ చేసి మాట్లాడడంతో శ్రద్ధ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. డాక్టర్ కావడం తన డ్రీమ్ అని బన్నీతో చెప్పిన శ్రద్ద త్వరలోనే హైదరాబాద్ వస్తానంది. దీంతో బన్నీ ఆమెను సాదరంగా ఆహ్వానించారు. పాప తర్వాత పేరెంట్స్ తోనూ మాట్లాడారు అల్లు అర్జున్. పాప కు సరైన ట్రీట్మెంట్ చేయించాలని సూచించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు బన్నీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ షేర్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం రాకా. కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సంస్థ సుమారు 800 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రాకా సినిమాను నిర్మిస్తోంది. దీంతో పాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోనూ ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు బన్నీ. త్వరలోనే ఈ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
వీడియో ఇదిగో..
Spreading Smiles Beyond Cinema
Icon Star @alluarjun interacted with Shraddha through the Make-A-Wish Foundation, creating a joyful and unforgettable moment for the young girl.
A gesture that reflects his genuine warmth and compassion.
pic.twitter.com/qExSfmTh6a
— Team Allu Arjun (@TeamAAOfficial) June 19, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

