సరైన వార్మ్-అప్ చేయకుండా ముందుగా యోగా ఆసనాలు మొదలు పెడితే అది శరీరం పైన ప్రభావము చూపిస్తుంది. ఇంకా కొందరు
యోగా మొదలుపెట్టగానే కష్టమైన ఆసనాలు వేయడానికి ప్రయత్నిస్తారు. దీని వలన కండరాలు, కీళ్లపై ఒత్తిడి కూడా పెరిగి గాయాలయ్యే అవకాశం ఉంది. అసలు మీరు యోగా స్టార్ట్ చేసే ముందు వార్మ్-అప్ చేయాలి
ఇతరులతో మీరు పోల్చుకుని శరీరాన్ని బలవంతంగా మీరు కూడా కొత్తగా ఆసనాలు చేయకండి. ఇంకా సోషల్ మీడియాలో కొత్త కొత్త వీడియోలు చూసి మీరు అలాగే చేయాలని ప్రయత్నించడం అంత మంచిది కాదు. మనిషి శరీర నిర్మాణం ఒక్కొకొకరికి ఒక్కోలా ఉంటుంది. ఇంకా మీ శరీరం సహకరించిన వరకు మాత్రమే యోగా చేయాలి
శ్వాసపై దృష్టి పెట్టకపోవడం: ఇంకా మీరు శ్వాసపై దృష్టి పెట్టకపోవడం వలన ప్రమాదాలు జరుగుతాయి. ఈ యోగాలో శ్వాస చాలా కీలకం అని చెబుతున్నారు. కొందరు ఆసనాలపై మాత్రమే దృష్టి పెట్టి శ్వాస గురించి ఆలోచించరు. సరైన శ్వాస లేకపోతే యోగా చేసినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇంకా ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం.
భోజనం చేసిన తర్వాత యోగా చేయడం: మంచిగా భోజనం చేసిన తర్వాత యోగా చేస్తే అసౌకర్యం, అజీర్ణం, వికారం వంటి సమస్యలు వస్తాయని యోగా నిపుణులు చెబుతున్నారు. మీరు భోజనం చేసిన 2 గంటల తర్వాత యోగా చేస్తే మంచిది. గంట తరవాత కూడా చేయకండి.
కొత్తవారు గంటల తరబడి యోగా చేస్తుంటారు. దీనివల్ల శరీరం అలసిపోతోంది ఇంకా దీని వలన కండరాల నొప్పులు కూడా వస్తాయి.
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ , నిపుణుల సలహా మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. మీకు యోగా చేసే సమయంలో ఎలాంటి ఇతర సమస్యలు ఉన్నా వైద్యుడిని సంప్రదించి చేయడం చాలా మంచిది.




