
Spirit: రెబల్ స్టార్ ప్రభాస్ – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘స్పిరిట్’ (Spirit). ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ‘స్పిరిట్’ మూవీకి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ ఫోటో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాల నీడలు కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో #Spirit హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారని సమాచారం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలకమైన షెడ్యూల్ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలులో షూట్ చేశారు.
నేరస్థుల వేటలో ఉండే ఒక ఇంటెన్స్ జైలు సీక్వెన్స్‌తో ఈ షూటింగ్ షెడ్యూల్‌ను చంచల్‌గూడలో చిత్ర యూనిట్ సక్సెస్‌పుల్‌గా ముగించిందని టాక్. సందీప్ రెడ్డి వంగా మార్క్ వైలెన్స్, ప్రభాస్ స్టార్ పవర్ కలగలిసి ఈ సీన్ థియేటర్లలో నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్నో అంచనాలు ఉన్న ‘స్పిరిట్’ చిత్రాన్ని మార్చి 5, 2027 న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.