Reading Time: 2 minutes

బ్రెజిల్ జెర్సీలో భారత కొత్త కెప్టెన్ రచ్చ.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్!

Caption of Image.

Shreyas Iyer Support Brazil: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2026 ఫుట్‌బాల్ ఫీవర్ టీమిండియాను కూడా చుట్టేసింది. భారత కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తన ఫుట్‌బాల్ పై తన అభిమానాన్ని చాటుకుంటూ ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్ జట్టుకు ఓపెన్‌గా సపోర్ట్ ప్రకటించాడు. బ్రెజిల్ టీమ్ స్పెషల్ బ్లాక్ అండ్ వైట్ గోల్‌కీపర్ జెర్సీని ధరించి స్టైలిష్‌గా దిగిన కొన్ని ఫొటోలను అతడు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి కాస్తా ట్రెండ్ అవుతున్నాయి.

బ్యూటిఫుల్ గేమ్ అంటూ శ్రేయస్ పోస్ట్: 
శ్రేయస్ అయ్యర్ ఈ ఫొటోలను తన ఎక్స్ (X) ఖాతాలో షేర్ చేస్తూ.. A nod to the beautiful game (అందమైన ఆట కోసం..) అంటూ బ్రెజిల్ ఫ్లాగ్ ఎమోజీని జత చేశాడు. ఒక బిల్డింగ్ బాల్కనీలో సిటీ స్కైలైన్ బ్యాక్‌గ్రౌండ్‌లో నిలబడి అయ్యర్ ఇచ్చిన పోజులు నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. మోనోక్రోమ్ (బ్లాక్ అండ్ వైట్) అబ్‌స్ట్రాక్ట్ డిజైన్‌తో కూడిన ఈ జెర్సీపై బ్రెజిల్ అధికారిక లోగో, కాలర్ లైన్స్ నియాన్-గ్రీన్ కలర్‌లో మెరుస్తూ హైలైట్‌గా నిలిచాయి. శ్రేయస్ ఫుట్‌బాల్ లవర్ అని మనకు ఆల్రెడీ తెలుసు.. మ్యాచ్‌ల ముందు వార్మప్ సెషన్స్‌లో మనోడు ఎప్పుడూ ఫుట్‌బాల్‌తోనే కనిపిస్తుంటాడు.

డిమాండ్ దెబ్బకు నైకీ సైట్‌లో స్టాక్ ఖాళీ:
ఈ వరల్డ్ కప్ సీజన్‌లో బ్రెజిల్ జెర్సీలకు ఉన్న క్రేజే వేరు.. దానికి తోడు శ్రేయస్ అయ్యర్ కూడా ఈ ఫొటోలు పోస్ట్ చేయడంతో ఈ గోల్‌కీపర్ జెర్సీకి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 100 డాలర్లు (దాదాపు ₹8,300) ధర కలిగిన ఈ జెర్సీ.. ప్రస్తుతం అఫీషియల్ నైకీ (Nike) వెబ్‌సైట్‌లో పూర్తిగా సోల్డ్ అవుట్ (స్టాక్ ఖాళీ) అయిపోయినట్లు సమాచారం. ఫుట్‌బాల్ ఫ్యాన్స్ తో పాటు జెర్సీ కలెక్టర్లు కూడా దీనిని కొనేందుకు ఎగబడుతున్నారు.

►ALSO READ | కోహ్లీ-రోహిత్‌కు 2027 వరల్డ్ కప్ డోర్ క్లోజ్.. బీసీసీఐ సైలెన్స్‌తో పెరిగిన ఉత్కంఠ

రేపే ఆఫ్ఘనిస్థాన్‌తో ఆఖరి వన్డే: 
శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే భారత్ 2–0 తేడాతో సిరీస్ కైవసం చేసుకోగా.. రేపు (జూన్ 20, శనివారం) చెన్నై వేదికగా మూడో ఆఖరి వన్డే జరగనుంది. ఈ వన్డే సిరీస్ ముగిసిన వెంటనే.. అయ్యర్ కొత్తగా బాధ్యతలు చేపట్టిన కెప్టెన్‌గా జూన్ 26 నుంచి ప్రారంభం కానున్న ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 పర్యటనలకు టీమిండియాను లీడ్ చేయనున్నాడు.

©️ VIL Media Pvt Ltd.