Reading Time: < 1 minute

పీవీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి ..16 భాషల్లో ప్రావీణ్యం ఉన్న పీఎం అవడం దేశానికే గర్వకారణం

Caption of Image.

పద్మారావునగర్, వెలుగు: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. బేగంపేట బ్రాహ్మణవాడిలోని స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గురువారం ఆయన సందర్శించారు. విద్యార్థులకు ఉచితంగా నోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్స్, బ్యాగులు అందజేశారు. 

తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. 16 భాషల్లో ప్రావీణ్యం ఉన్న పీవీ దేశానికే గర్వకారణమన్నారు. పాఠశాలలో అదనపు గదులు, ఆధునిక లైబ్రరీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 

ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు అండగా నిలవాలని తలసాని ట్రస్ట్ ద్వారా భోజన సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మాట్లాడుతూ.. నవోదయ, రెసిడెన్షియల్ పాఠశాలల స్థాపనతో పీవీ నరసింహారావు దేశ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని పేర్కొన్నారు.  
 

©️ VIL Media Pvt Ltd.