
హైదరాబాద్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వైపు వెళ్లే వాహనదారులకు అలర్ట్ మెసేజ్.. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణక్రమంలో ఇవాళ ( జూన్ 21) వన్ వే ట్రయల్ రన్ ప్రారంభించారు ట్రాఫిక్ పోలీసులు. ఉదయం 10 గంటలనుంచి రాత్రి 8గంటల వరకు వన్ వే ట్రాఫిక్ డైవర్షన్ అమలులో ఉంటుంది. ఎల్ వి ప్రసాద్ హాస్పిటల్ వైపు నుంచి వచ్చే వాహనాలను బసవతారకం, ఒమేగా హాస్పిటల్, భారతీయ విద్యా భవన్ స్కూల్ జంక్షన్, జర్నలిస్ట్ కాలనీ మీదుగా చెక్ పోస్ట్ వైపు మళ్లిస్తున్నారు అధికారులు. అందువల్ల వాహన దారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలను కొనసాగించాలని వాహనాదారులకు ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
అలెర్ట్: కేబీఆర్ పార్క్ చుట్టూ ఆదివారం వన్-వే ట్రాఫిక్ ట్రయల్ రన్
బంజారాహిల్స్ – జూబ్లీహిల్స్ కారిడార్లో కొనసాగుతున్న హెచ్-సిటి (H-CITI) ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం వన్-వే ట్రాఫిక్ ట్రయల్… https://t.co/TRJ1Kq3iVF pic.twitter.com/aI8NijQAmH
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) June 20, 2026