Reading Time: < 1 minute

సాయికృష్ణ లాకప్ డెత్ పై మానవ హక్కుల కమిషన్ కు వైసీపీ ఫిర్యాదు..

Caption of Image.

ఏపీలో సాయికృష్ణ లాకప్ డెత్ రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. సాయికృష్ణ మృతికి సీఐ నాగరాజు,  పోలీసులే కారణమంటూ ఆరోపియస్తోంది వైసీపీ. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం సీఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో సాయికృష్ణ లాకప్ డెత్ పై మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది ప్రతిపక్ష వైసీపీ. 

సాయికృష్ణ లాకప్ డెత్ తో పాటు క్రాంతికుమార్ ఆత్మహత్యపై కూడా విచారణ జరపాలని కోరింది వైసీపీ. ఈ మేరకు మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ కు వినతిపత్రం అనిదించారు వైసీపీ ఎంపలు గురుమూర్తి, తనూజారాణి.

►ALSO READ | గండిపేట భూముల కేసులో బొల్లా బ్రహ్మనాయుడుకు బెయిల్.

విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్, లాకప్ డెత్ కు గురైన గాదె సాయికృష్ణ కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ రెండు ఘటనలపై తక్షణమే విచారణ జరపాలని మానవ హక్కుల కమిషన్ ను కోరారు.ఈ రెండు ఘటనల వెనక నిజాలను బయటికి తీసి బాద్యులైన అధికారులను కఠినంగా శిక్షించాలని కోరింది వైసీపీ.
 

©️ VIL Media Pvt Ltd.