Reading Time: < 1 minute
Yashs Toxic New Release Date Out Postponement Drama Ends Officially

కన్నడ రాకింగ్ స్టార్ యష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ మూవీ విడుదల తేదీపై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యష్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్స్, విడుదల తేదీ విషయంలో ఎలాంటి అప్డేట్ లేదు. దాంతో అసలు ఈ సినిమా వస్తుందా రాదా అనే  రూమర్స్ కూడా వచ్చాయి. మొత్తానికి రూమర్స్ కు చెక్ పెడుతూ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు.

కన్నడ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన టాక్సిక్ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించింది. యష్‌ను సరికొత్త రగ్గడ్ అండ్ స్టైలిష్ లుక్‌లో  చూపిస్తూ సినిమాపై అంచనాలను ఓ రేంజ్ కి తీసుకువెళ్లారు మేకర్స్. కన్నడ భారీ చిత్రాల నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్  బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ అధికారిక ప్రకటనతో అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో ‘టాక్సిక్’ హంగామా మళ్లీ మొదలైంది. అనేక వాయిదాలు, రీషూట్స్ అనంతరం రిలీజ్ అవుతున్న టాక్సిక్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో మరో రెండు నెలల్లో తేలనుంది.