Reading Time: < 1 minute

A P News: విజయవాడ సాయికృష్ణ హత్యకేసు.. విచారణకు సిట్ నియామకం

Caption of Image.

ఆంధ్రప్రదేశ్​ లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ  కేసులో ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ఈ కేసును పూర్తిస్థాయిలో విచారించే నలుగురు సభ్యులతో సిట్​ ను నియమించింది. సిట్ చీఫ్‌గా ఐజీ రవి ప్రకాష్ ఉండగా.. సభ్యులుగా పశ్చిమగోదావరి ఎస్పీ అద్నాన్ నయీం షమీ, అల్లూరు సీతారామరాజు ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ SP ఎల్ సుధాకర్‌ని నియమించింది. 

కేసు వివరాల్లోకి వెళ్తే .. విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ మే 9న అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఆయనను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, హింసించి చంపేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

 సాయికృష్ణ  కేసు వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. ఈ కేసును విచారించేందుకు  కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికకు వెళ్లిన అధికారులు.. అక్కడ పని చేసే బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.  సాయికృష్ణను లాకప్‌డెత్‌ చేశారనే  అనుమానాలు వ్యక్తమయ్యాయి, ఈ నేపథ్యంలో  కృష్ణలంక రౌడీషీటర్ … గాదే సాయికృష్ణ హత్య కేసులో కృష్ణలంక సీఐ నాగరాజును అరెస్ట్ చేసేందుకు అది సింగ్ నగర్ షాదీ ఖానా ప్రాంతంలో ఆయన నివాసానికి అధికారులు చేరుకొని.. ఆయనను డీసీపీ లతా కుమారి విచారిస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.