Reading Time: < 1 minute
Priyadarshi Next Movie Folk Singer Nagadurga Heroine Sukumar Writings

Nagadurga: టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రియదర్శి. తాజా సమాచారం ప్రకారం ఆయన హీరోగా ‘లెక్కల మాస్టర్’ సుకుమార్‌కి చెందిన సుకుమార్ రైటింగ్స్, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ సంయుక్తంగా ఓ ఆసక్తికరమైన చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా వంశీ రెడ్డి దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమవుతున్నారని టాక్.

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఒక సరికొత్త టాలెంట్‌ను వెండితెరకు పరిచయం చేయబోతున్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రముఖ ఫోక్ సింగర్, డాన్సర్ నాగదుర్గ ఈ చిత్రంలో ప్రియదర్శి సరసన హీరోయిన్‌గా ఎంపికయ్యారని సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నాగదుర్గ, ఇప్పుడు వెండితెరపై హీరోయిన్‌గా మెరవనుండడం విశేషం. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.