Reading Time: 2 minutes

గ్రౌండ్‌లోనే గుక్కపెట్టి ఏడ్చిన టర్కీ ఫుట్బాల్ ప్లేయర్స్.. పరాగ్వే దెబ్బకు వరల్డ్ కప్ నుంచి ఔట్!

Caption of Image.

Turkey vs Paraguay: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) మెగా టోర్నీలో మరో పెను సంచలనం నమోదైంది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టర్కీ (Turkey) జట్టు వరల్డ్ కప్ ప్రయాణం విషాదకరంగా ముగిసింది. ఉత్కంఠభరితంగా జరిగిన నాకౌట్ పోరులో పరాగ్వే (Paraguay) చేతిలో 1–0 తేడాతో టర్కీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మ్యాచ్ ముగిసిందని రెఫరీ ఫైనల్ విజిల్ వేయగానే టర్కీ ప్లేయర్స్ ఒక్కసారిగా గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయారు. తమ వరల్డ్ కప్ కల ఇక్కడితోనే ముగిసిపోయిందనే బాధను తట్టుకోలేక పలువురు ఫుట్‌బాల్ ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకోవడం ఫ్యాన్స్‌ను తీవ్రంగా కలచివేసింది.

పరాగ్వేను కూడా కొట్టలేకపోయిన టర్కీ: 
మ్యాచ్ ఆరంభంలోనే పరాగ్వే ప్లేయర్ మథియాస్ గలార్జా మైండ్ బ్లోయింగ్ గోల్ కొట్టి తన జట్టుకు 1–0 లీడ్ అందించాడు. ఆ తర్వాత టర్కీ ఆటగాళ్లు మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ సాధించి, పరాగ్వే గోల్ పోస్ట్‌పై వరుస దాడులు చేశారు. కానీ పరాగ్వే డిఫెన్స్ మాత్రం గోడలా అడ్డు నిలిచింది. టర్కీకి ఎన్నో గోల్స్ చేసే ఛాన్స్ లు వచ్చినప్పటికీ, వాటిని ఫినిష్ చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు.

ALSO READ : వర్డల్కప్ ముందు భారత్కి బిగ్ షాక్..

నోరు మూసుకున్నందుకు రెడ్ కార్డ్: 
ఈ మ్యాచ్ లో ఒక క్రేజీ అండ్ కాంట్రవర్షియల్ ఇన్సిడెంట్‌కు వేదికైంది. ఫుట్‌బాల్‌ హిస్టరీలోనే సరికొత్త డిసిప్లినరీ రూల్ (క్రమశిక్షణా నియమం) కింద పరాగ్వే స్టార్ ప్లేయర్ మిగ్యుల్ అల్మిరాన్‌కు రెఫరీ నేరుగా రెడ్ కార్డ్ ఇచ్చి గ్రౌండ్ నుంచి బయటకి పంపించేశాడు. కాగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్లేయర్స్ లేదా రెఫరీలతో గొడవకి దిగినప్పుడు.. తాము ఏం మాట్లాడుతున్నామో కెమెరాలకు/రెఫరీలకు తెలియకుండా ఉండటం కోసం నోటిని చేతులతో కవర్ చేసుకోవడం (Covering Mouths) ఈ కొత్త రూల్ ప్రకారం నేరం.. అల్మిరాన్ సరిగ్గా ఇదే తప్పు చేయడంతో వరల్డ్ కప్ హిస్టరీలోనే ఈ రూల్ కింద రెడ్ కార్డ్ తీసుకున్న ఫస్ట్ ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. దీంతో పరాగ్వే టీమ్ కేవలం 10 మంది ఆటగాళ్లతోనే ఆడినప్పటికీ.. ఆ అడ్వాంటేజ్‌ను టర్కీ అసలు ఉపయోగించుకోలేపోవడంతో టోర్నీ నుంచి నిష్ర్కమించింది. 

 

 

©️ VIL Media Pvt Ltd.