Reading Time: 2 minutes

Health : ఎలా పడితే అలా ఆవిరి పట్టకండీ.. రోగాన్ని బట్టి ఇలా ఆవిరి పట్టండి.. 90 శాతం మందికి ఇది తెలియదు..!

Caption of Image.

మామూలుగా జలుబు చేసి ముక్కు దిబ్బడతో ఊపిరి తీసుకోవటం ఇబ్బందిగా ఉంటే ఆవిరి పట్టటం మన ఇంట్లో దాదాపు రెగ్యులర్ గా జరిగేదే. మామూలుగా ఈ వర్షా కాలం సీజన్ లో చేస్తూనే ఉంటాం. అయితే ఆవిరిని ఎలా పడితే అలా పట్టకూడదు.. డిసీజ్​ ను బట్టి పట్టాలి.. ఈ విషయం చాలా మందికి తెలియదు.  ఆవిరి ఎలా పట్టాలో ఈస్టోరీలో తెలుసుకుందాం.  .! 

 మామూలు జలుబుకి పరేషాన్ అవ్వకుండా ముందు ఆవిరి పట్టి రిలీఫ్ కావాలి.నార్మల్ జలుబుకి కొద్దిగా నీళ్ళని మరిగించి అందులో నీలగిరి తైలమో లేదా జిందా తిలిస్మాతో వేసుకుంటే జలుబు తగ్గి పోతుంది. జలుబు ఒక్కటే కాదు ఒత్తిడి, అలసట, ముఖం అందంగా మెరుస్తుంది కూడా. జలుబు చేసినప్పుడు ఎవరైనా వెంటనే ఇచ్చే సలహా ‘ఆవిరి పట్టండి అని జలుబు చేసినపుడు మాత్రమే ఆవిరి పట్టడం అనేది మనకి తెలిసింది. కానీ ఆవిరి పట్టడం అంటే కేవలం జలుబు చేసినప్పుడు ముక్కుకారడం నుంచి రిలీఫ్ ఉంటుంది.  

ఆవిరి ఎలా పట్టాలి..

  • నీళ్లను బాగా మరిగించి ఇందులో కొద్దిగా కర్పూరం, పసుపు వేసి ఆవిరి పట్టాలి. శ్వాస బాగా ఆడుతుంది. విక్స్.. జండూబామ్ కూడా వేసుకొని ఆవిరి పట్టవ చ్చు. ఇవేమీ అందుబాటులో లేనప్పుడు బాగా మరిగించిన నీటిలో పసుపు వేసి ఇంకాస్త మరిగించి ఆవిరి పట్టాలి. ఇలా రోజుకు రెండుసార్లు జలుబు తగ్గేవరకు ఆవిరి పట్టొచ్చు.
  • జలుబు చేసినప్పుడు చిరాకుగా ఉంటుంది. త్వరగా అలిసిపోయినట్లుగా అనిపిస్తుంటుంది. అందుకే ఈ టైంలో ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి.
  • వేడిపాలల్లో చిటికెడు పసుపు వేసి పిల్లలకు తాగిస్తే జలుబు నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
  • అల్లం, మిరియాల చాయ్ తాగినా లేదా వేడి లిక్విడ్స్ తీసుకున్నా జలుబు నుంచి రిలీఫ్ ఉంటుంది.

జలుబు చేసినప్పుడు శుభ్రత ముఖ్యం..

 

  • తుమ్మినా, దగ్గినా కర్చీఫ్​ వాడాలి. అయితే దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకో వటం, లేదంటే కొత్తది మార్చుకోవటం మర్చిపోవద్దు..
  • రెండు గ్లాసుల నీటిని వేడి చేసి టీ బ్యాగు లను ఉంచి ఆవిరి పట్టుకున్నా, ముఖం తాజాగా మెరుస్తుంది. ఇదే సమయంలో కొన్ని కొబ్బరి నూనె చుక్కలు వేసుకుంటే, ముఖానికి తేమ తగులుతుంది.
  • డెయిలీ రొటీన్. పని ఒత్తిడితో అలసిపోతే, కండరాలను యాక్టివ్ చేసేందుకు ఆవిరి పట్టడం మంచి ట్రీట్ మెంట్. దీని వల్ల తిన్న ఆహారం జీర్ణం కావడంతో పాటు కీళ్ల నొప్పుల నుంచి రిలీఫ్ ఉంటుంది.
  • నీళ్లలో పుదీనా ఆకులను వేసుకోవడం నిమ్మగడ్డిని ఉంచడం, యూకలిప్టస్ ఆకులతో తయారైన నూనె వేయడం వల్ల పిల్లల్లో జలుబు తొందరగా తగ్గుతుంది.
  • ఉబ్బసం, ఆయాసం, జలుబులతో బాధ పడుతున్నప్పుడు ఏర్పడే ముక్కుదిబ్బడ నుంచి ఆవిరి పట్టడం వల్ల వెంటనే రిలీఫ్ ఉంటుంది
©️ VIL Media Pvt Ltd.