Reading Time: 2 minutes

కోహ్లీ-రోహిత్‌కు 2027 వరల్డ్ కప్ డోర్ క్లోజ్.. బీసీసీఐ సైలెన్స్‌తో పెరిగిన ఉత్కంఠ

Caption of Image.

Rohit Sharma vs Virat Kohli: భారత జట్టు ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో దూసుకుపోతోంది. వచ్చే ఏడాది (2027) జరగబోయే వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా బీసీసీఐ ఇప్పటి నుంచే రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తోంది. అయితే భారత క్రికెట్ అభిమానుల మైండ్‌లో మెదులుతున్న ఒకే ఒక్క బిగ్గెస్ట్ క్వశ్చన్.. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) ఈ మెగా టోర్నీలో ఆడతారా లేదా?.. ఈ హాట్ టాపిక్‌పై బీసీసీఐ (BCCI) సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందించారు. కానీ, ఆయన ఈ ప్లాన్స్‌పై మౌనంగా ఉన్నారు.. ఇవన్నీ బోర్డ్‌రూమ్ సీక్రెట్స్ అంటూ మాట దాటేశారు. 

వ్యూహాత్మక చర్చలు.. బయటకు చెప్పలేం: 
వరల్డ్ కప్ ప్రణాళికలపై దేవజిత్ సైకియా పీటీఐ (PTI) తో మాట్లాడుతూ.. బోర్డులో చాలా అనుభవజ్ఞులైన నిపుణులు, సెలెక్టర్లు ఉన్నారని, నిర్ణయాలన్నీ అందరితో చర్చించి తీసుకుంటామని చెప్పారు. ఇవి వ్యూహాత్మక (Strategic) చర్చలు కాబట్టి, వీటిని మీడియా ముందు గానీ, పబ్లిక్‌గా గానీ రివీల్ చేయడానికి తనకు అనుమతి లేదని, ఇలాంటి విషయాలు బోర్డ్‌రూమ్‌లోనే ఉండాలని ఆయన తేల్చి చెప్పారు. ఒకవైపు కోచ్ గౌతమ్ గంభీర్ యంగ్ టీమ్‌ను బిల్డ్ చేయాలని చూస్తుంటే.. రోహిత్, కోహ్లీలు మాత్రం వరల్డ్ కప్ ఆడాలని కసితో ఉన్న తరుణంలో ఈ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

►ALSO READ | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి యువరాజ్ సింగ్ ఎంట్రీ?.. ఐపీఎల్ 2027కు భారీ ప్లాన్స్!

రోహిత్, విరాట్ ఫామ్ కీలకం: 
కెరీర్ చివరి దశలో ఉన్నా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.. కోహ్లీ ఐపీఎల్ 2026 లో అద్భుతమైన ఫామ్‌తో అత్యధిక పరుగులు చేసిన టాప్-4 బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. గాయం కారణంగా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమైనప్పటికీ.. త్వరలోనే ఇంగ్లాండ్ సిరీస్ నాటికి టీమ్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. మరోవైపు, ఐపీఎల్ 2025 సీజన్ ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్‌కు అంతగా కలిసిరాలేదు (9 మ్యాచ్‌ల్లో 283 రన్స్ ). కానీ, ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో 48 రన్స్ కొట్టి మంచి టచ్‌లో కనిపించాడు. వరల్డ్ కప్ లోపు తన పాత ఫామ్‌ను అందుకోవాలని హిట్ మ్యాన్ చూస్తున్నాడు.
 

©️ VIL Media Pvt Ltd.