Reading Time: < 1 minute
Prabhas Mobile Wallpaper Leak Kalki 2 Karna Look Viral

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి చిన్న అప్డే్ట్ బయటికి వచ్చిన కూడా సోషల్ మీడియాలో నిమిషాల్లో ట్రెండ్ అవుతుంది. తాజాగా ప్రభాస్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం నెట్టింట సంచలనంగా మారింది. ఆయన వ్యక్తిగత మొబైల్ ఫోన్ వాల్‌పేపర్ ఏంటనేది తాజాగా బయటపడింది. అది ఎలాగో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇటీవల ప్రముఖ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింగ్ గీతం’ సినిమా విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నిర్మాత – కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సినిమా ప్రమోషన్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న సమయంలో ప్రభాస్ తన చేతిలోని మొబైల్ ఫోన్‌ను కాస్త పక్కకు తిప్పారు. ఆ టైంలో అనుకోకుండా ఆయన ఫోన్ స్క్రీన్ వెలిగింది. ఇంకేముంది, నెటిజన్లు ఆ స్క్రీన్‌ను వెంటనే గమనించారు. అందులో ‘కల్కి’ సినిమాలో ప్రభాస్ పోషించిన పవర్‌ఫుల్ ‘కర్ణ’ క్యారెక్టర్ వాల్‌పేపర్‌గా కనిపించింది.

దీనితో ఈ స్క్రీన్ షాట్స్ – ఈ ఇంటర్వ్యూ వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రమోషన్ కోసం వచ్చిన డార్లింగ్‌‌ను చూడాలని అనుకున్న ఫ్యాన్స్‌కు, ఇలా అనుకోకుండా ప్రభాస్ ఫోన్ స్క్రీన్‌పై కర్ణ క్యారెక్టర్ వాల్ పేపర్‌ పెట్టుకొని కనిపించడంతో మస్త్ ఖుషీ అవుతున్నారు. ఈ ఒక్క వాల్‌పేపర్‌తో ‘కల్కి 2’ (Kalki Part 2) చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లాయని డార్లింగ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రభాస్‌కు కూడా తన కెరీర్‌లో ‘కర్ణుడు’ పాత్ర ఎంత ప్రత్యేకమైనదో, ఆయన ఆ క్యారెక్టర్‌ను ఎంతగా ఓన్ చేసుకున్నారో ఈ చిన్న సంఘటన ద్వారా స్పష్టమవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ ఫస్ట్ పార్ట్‌లో క్లైమాక్స్ ఇంటర్వెల్ సీన్స్ – కర్ణుడిగా ప్రభాస్ ఎంట్రీ థియేటర్లలో పూనకాలు తెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ మొబైల్ వాల్‌పేపర్ కూడా అదే లుక్‌తో కనిపించడంతో, రాబోయే పార్ట్-2 లో కర్ణుడి విశ్వరూపం ఎలా ఉండబోతోందా అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు.