
బిచ్చగాడు కాంబినేషన్ అనగానే ఆడియన్స్ లో ఏదో తెలియని ఒక వైబ్, భారీ అంచనాలు క్రియేట్ అవుతాయి. కోలీవుడ్ స్టార్ విజయ్ అంటోనీ, డెరెక్టర్ శశి కాంబోలో తెరకెక్కించిన మరో ఎమోషనల్ డ్రామా ‘వంద దేవుళ్లు’ (తమిళంలో నూరు సామి). భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఈరోజు ( జూన్ 19, 2026) థియేటర్లలోకి వచ్చింది. ఎన్నో అవాంతరాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత థియేటర్లలోకి వచ్చిన ఇంటెన్సివ్ ఫిల్మ్ ఆడియన్స్ పల్స్ పట్టుకుందా? థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అసలు కథేంటి? ప్రేక్షకులు అభిప్రాయం ఎలా ఉందో చూద్దాం..
కథేంటంటే?
ఒక మారుమూల పల్లెటూరులో వాసవి ( స్వాసిక ) అనే మధ్యవయస్కురాలైన ఒంటిరి తల్లి , తన ఇద్దరు కొడుకులను ఎంతో కష్టపడి పెంచుతుంది. అయితే ఒకానొక దశలో తోడు కోసం మళ్లీ పెళ్లి చేసుకోవాలని వాసవి భావిస్తుంది. అయితే దీనిని తన పెద్ద కొడుడు బాస్కర్ వ్యతిరేకిస్తాడు. ఈ వయసులో వివాహం చేసుకుంటే సమాజం చిన్న చూపు చూస్తుందని అడ్డుచెబుతారు. కొంత కాలం తర్వాత పెద్ద కొడుకు తన మనసు మార్చుకుంటాడు. తల్లికి తోడు కావాలిని మళ్లీ పెళ్లి చేసేందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. కానీ అప్పటికే కాలం మించిపోతుంది. తల్లి నో అంటుంది. ఈ ఎమోషనల్ మైండ్ గేమ్‌లోకి మన హీరో ఏడుకొండలు (విజయ్ ఆంటోనీ) ఎలా ఎంట్రీ ఇచ్చాడు? చుట్టుపక్కల జనం, చుట్టాల రియాక్షన్ ఏంటి? అనేదే అసలు సిసలైన ట్విస్ట్.. ఒక యథార్థ సంఘటన ఆధారంగా శశి ఈ కథను పీక్స్ ఎమోషన్స్‌తో మలిచారు.
ఎవరెలా చేశారు?
నిజ జీవిత వయసు కంటే చాలా పెద్దదైన క్యారెక్టర్ చేయాలంటే ఏ హీరోయిన్‌కైనా మామూలు గట్స్ సరిపోవు. స్వాసిక ఆ ఛాలెంజ్‌ను చాలా ఈజీగా హ్యాండిల్ చేసింది. వాసవి పాత్రలో ఆమె పలికించిన హావభావాలు, ఎమోషనల్ డెప్త్ సినిమాకే అతిపెద్ద ప్లస్ పాయింట్. ఇక సెకండాఫ్‌లో ఎంట్రీ ఇచ్చే విజయ్ ఆంటోనీ తన మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్ , ఎనర్జీతో థియేటర్‌లో వైబ్స్ మార్చేశాడు. స్వాసిక, విజయ్ ఆంటోనీల మధ్య వచ్చే ప్రతి సీన్ హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. అజయ్ ధీషన్ కొడుకు పాత్రకు పూర్తి న్యాయం చేయగా, సపోర్టింగ్ రోల్స్‌లో లిజోమోల్ జోస్, కరుణాస్, బాలాజీ శక్తివేల్ నటన సినిమాకు మరింత వెయిట్ తెచ్చింది.
►ALSO READ | Nagabandham Trailer: వేల ఏళ్ల రహస్యం.. గుప్త నిధుల కోసం పోరు.. ‘నాగబంధం’ ట్రైలర్ గూస్ బంప్స్
ప్లస్ .. మైనస్ ఇవే..
సమాజంలో ఒంటరి మహిళలు ఎదుర్కొనే సమస్యను ప్రాక్టికల్‌గా ఒక ఎమోషనల్ లో చూపించారు దర్శకుడు. క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ స్క్రీన్‌ప్లే ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది.విలేజ్ అట్మాస్ఫియర్ విజువల్స్ పల్లెటూరిని గుర్తుచేస్తాయి. భాష్యశ్రీ రాసిన తెలుగు డైలాగ్స్ గుండెకు హత్తుకుంటాయి. అయితే ఫస్టాఫ్ లో ఒకే పాయింట్ చుట్టూ కథ తిరుగుతూ కాస్త ల్యాగ్ గా అనిపిస్తుంది. అంతే కాదు ఈ మూవీలో ఇంకాస్త ఎమోషనల్ డెప్త్ పెంచి ఉంటే బాగుండేది. సీరియస్ సీన్స్‌లో కామెడీ పెట్టడం మైనస్ అయిందన్న అభిప్రాయాన్ని సినీ ప్రియులు వ్యక్తం చేస్తున్నారు.
థియేటర్ల యజమానులకు థాంక్స్!
రిలీజ్ కంటే ముందు కొన్ని డిస్ట్రిబ్యూషన్ ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఈ చిత్రం శుక్రవారం ( జూన్ 19, 2026 ) గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ రోజే బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించింది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సోషల్ మెసేజ్ ఉండటంతో ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తిరుప్పూర్ సుబ్రమణియానికి విజయ్ ఆంటోనీ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ థాంక్స్ చెప్పారు. కష్టకాలంలో తనకు వెన్నుముకగా నిలిచి, సినిమా సజావుగా రిలీజ్ కావడానికి ఆయనే కారణమంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. లిజోమోల్ జోస్, కరుణాస్, బాలాజీ శక్తివేల్ వంటి నటీనటులు ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చారు.
#VandaDevullu Premiere Response.@vijayantony is back with an emotional heartfelt “Amma Prema” story for Telugu audiences.#VijayAntony pic.twitter.com/Ll5lgx6RdP
— Telugu Bit (@Telugubit) June 18, 2026
మొత్తానికి స్లోగా సాగే ఫస్టాఫ్ పక్కన పెడితే.. ప్యూర్ ఎమోషన్స్, అద్భుతమైన నటన కోసం ‘వంద దేవుళ్లు’ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఒకసారి చూసేయొచ్చు అన్న అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.