Reading Time: 2 minutes

Prabhas: చంచల్‌గూడ జైలులో ప్రభాస్.. హైప్తో పోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ సందీప్!

Caption of Image.

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్-ఇంటెన్సిటీకి కేరాఫ్ అడ్రస్ ఐన సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘స్పిరిట్’. ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. పోస్టర్ రిలీజ్ నుంచే ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్ హైప్ సొంతం చేసుకుని, ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతోంది. ప్రస్తుతం ‘స్పిరిట్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సందీప్ రెడ్డి వంగా దాదాపు రెండు నెలల పాటు సాగే భారీ లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే కొంపల్లి, అజీజ్‌నగర్, కోటి ఉమెన్స్ కాలేజ్, బాలానగర్ విమల్ థియేటర్ తదితర ప్రాంతాల్లో కీలక షెడ్యూల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన చిత్రబృందం, ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్ జరుపుకుంటుంది.

ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆదివారం (జూన్ 21న) చంచల్‌గూడ జైలులో స్పిరిట్ షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ షెడ్యూల్ స్టార్ట్ అయిందని, ప్రభాస్ కూడా పాల్గొన్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.ఈ మేరకు డైరెక్టర్ సందీప్ సైతం ఓ క్రేజీ షాడో ఫోటో పోస్ట్ చేసి రెబల్ ఫ్యాన్స్లో అంచనాలు పెంచేశారు. దీంతో హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ సందీప్ను ట్యాగ్ చేస్తూ.. హైప్తో పోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ సందీప్! అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. 

ఈ క్రమంలోనే ప్రభాస్‌కు ఉన్న అపారమైన క్రేజ్ దృష్ట్యా షూటింగ్ లొకేషన్ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు చేరుకునే అవకాశం ఉందని పోలీసులు భావించగా, జైలు పరిసరాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ కి సంబంధించిన ఓ ఫోటో కూడా లీకై వైరల్ అవుతుంది. 

ఈ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. సందీప్ రెడ్డి వంగ మార్క్ ఇంటెన్స్, ఫైర్ బ్రాండ్ క్యారెక్టరైజేషన్‌తో ప్రభాస్ పాత్ర మరింత రౌద్రంగా, తీవ్రంగా ఉండబోతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ప్రభాస్‌కు జోడీగా, ‘యానిమల్’ బ్లాక్‌బస్టర్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి డిమ్రి నటిస్తుంది. ప్రభాస్-త్రిప్తిల ఫ్రెష్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చూడటానికి ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారు.

వీరితో పాటు, ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘స్పిరిట్’ చిత్రాన్ని టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం మార్చి 5, 2027న ప్రపంచ దేశాల అభిమానుల ముందుకు రానుంది. 

©️ VIL Media Pvt Ltd.