Reading Time: < 1 minute

జగిత్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షం… ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం…

Caption of Image.

జగిత్యాల జిల్లాలో ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆదివారం ( జూన్ 21 ) సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో జగిత్యాలలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అప్పటివరకు ఎండ వేడితో అల్లాడిన జనం కొంతమేర ఉపశమనం పొందారు.

జగిత్యాల పట్టణంతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలికి పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడటంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వర్షంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ వారం దాటితే మాన్సూన్ మరింతగా విస్తరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఐఎండీ చెబుతున్నది. ప్రస్తుతానికి రుతుపవనాలు బలహీనంగానే ఉన్నా.. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలుంటాయని పేర్కొంది. జులై 1 వరకు రాష్ట్రంలో ఉండే వాతావరణ పరిస్థితులపై ఐఎండీ తాజా అంచనాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా వేడిగాలుల ప్రభావం, పశ్చిమ, తూర్పుగాలుల మధ్య హోరాహోరీ ఎఫెక్ట్ రుతుపవనాలు స్తంభించిపోయాయి.

►ALSO READ | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాదం… అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి…

రాష్ట్రంలో ఈ రెండు వారాల పాటు సాధారణం కన్నా తక్కువ వర్షాలే పడుతాయని ఐఎండీ అంచనాల్లో పేర్కొంది. కేవలం కొంకణ్, గోవా, కర్నాటక, రాయలసీమ, కేరళ, తమిళనాడుల్లో మాత్రమే సాధారణం లేదా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మిగతా దేశమంతా లోటు వర్షపాతమే రికార్డ్ అవుతుందని హెచ్చరించింది.
 

©️ VIL Media Pvt Ltd.