Reading Time: < 1 minute

నిజామాబాద్నగర శివారులోని అరణ్య అర్బన్పార్క్ ఓపెన్…వర్చువల్గా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Caption of Image.

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్​నగర శివారులోని మాక్లూర్​మండలం మానిక్​బండార్​వద్ద నిర్మించిన అరణ్య అర్బన్​పార్క్​ను గురువారం సీఎం రేవంత్​రెడ్డి వర్చువల్​పద్ధతిలో ప్రారంభించారు. వనమహోత్సవంలో భాగంగా 476 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ పార్క్​ను ప్రజలకు అంకితం చేశారు. అలసిసొలసి వచ్చే సందర్శకులకు ఆహ్లాదం, ఉల్లాసం కలుగాలని సీఎం ఆకాంక్షించారు. 

ప్రారంభోత్సవ వేడుకను ప్రజలు చూసేలా ఎల్ఈడీ స్ర్కీన్​ను ఆఫీసర్లు ఏర్పాటు చేశారు. ఫారెస్ట్​కన్జర్వేటర్​అర్పన, కలెక్టర్​ఇలా త్రిపాఠి, ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి, రాష్ట్ర కోఆపరేటివ్​డెవలప్​మెంట్ కార్పొరేషన్​చైర్మన్​మానాల మోహన్​రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు కిరణ్​కుమార్, భుజంగరావు, డీఎఫ్​వో సిద్దార్థ్​విక్రమ్​సింగ్​ తదితరులు ఉన్నారు.

©️ VIL Media Pvt Ltd.