Reading Time: < 1 minute

రేపే(జూన్ 21) నీట్ రీ ఎగ్జామ్‌‌‌‌…దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది అభ్యర్థులు

Caption of Image.
  •     2 లక్షల మంది సిబ్బందితో నిఘా
  •     మన రాష్ట్రంలో పరీక్ష రాయనున్న 72వేలకు పైగా విద్యార్థులు

హైదరాబాద్, వెలుగు: నీట్ (యూజీ) 2026 రీ -ఎగ్జామ్ నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపే (ఆదివారం) మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పెన్ -అండ్- పేపర్ మోడ్​లో ఈ పరీక్ష జరగనుంది. ఈ ఎగ్జామ్ కోసం దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో ఎగ్జామ్ సెంటర్లను సిద్ధం చేశారు. మొత్తం 22.79 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానుండగా, ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా సుమారు 2 లక్షల మంది సిబ్బందిని పరీక్షా విధుల్లో మోహరించారు. ఇందులో 674 మంది సిటీ కో ఆర్డినేటర్లు, 6,669 మంది అబ్జర్వర్లతో పాటు పెద్ద సంఖ్యలో ఇన్విజిలేటర్లు పర్యవేక్షణ చేయనున్నారు. పరీక్షా సామగ్రి, రవాణా కోసం పోలీసు బలగాలు, ఎస్కార్ట్ టీమ్​లో సాయం తీసుకుంటున్నారు. మన రాష్ట్రం నుంచి 72 వేలకుపైగా విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 

నిమిషం ఆలస్యం అయినా నో ఎంట్రీ.. 

అభ్యర్థులు ఉదయం 11 నుంచి రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా, మధ్యాహ్నం 1:30కే గేట్లు మూసివేస్తారు. తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఎన్టీఏ తేల్చిచెప్పింది. అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డ్ ప్రింటెడ్ కాపీ, ఒరిజినల్ ఫొటో ఐడీ కార్డ్, 2 పాస్‌‌‌‌ పోర్ట్ సైజు ఫొటోలు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించింది. పరీక్షకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా ఎన్టీఏ హెల్ప్‌‌‌‌లైన్ నంబర్లకు 011–-40759000 ఫోన్ చేయవచ్చని అధికారులు సూచించారు.

©️ VIL Media Pvt Ltd.