
తెలుగురాష్ట్రాల గుండా వెళ్లే బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పనులను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ వేగవంతం చేస్తోంది. హైదరాబాద్-అమరావతి-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు సంబంధించి రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. అయితే ఈ కారిడార్ ఏపీ నూతన రాజధాని అమరావతి మీదుగా వెళ్లనున్నట్టు తెలుస్తోంది. తొలుత దీన్ని రావెల దగ్గర ఏర్పాటు అయ్యే నూతన ఎయిర్‌పోర్టుకు దగ్గర్లో నిర్మించాలని నిర్ణయించినప్పటికీ.. అమరావతి, విజయవాడకు స్టేషన్ దూరం అవుందనే ఉద్దేశంలో మళ్లీ.. అమరావతికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే అమరావతి మీదుగా కారిడార్ వెళ్లేలా ఫైనల్ లొకేషన్ సర్వే, డీపీఆర్ రూపొందించాలని NHSRCL రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సూచించింది.
అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్
ఈ హైదరాబాద్-అమరావతి-చెన్నై కారిడార్ మొత్తం మూడు రాష్ట్రాలను కలుపుతుంది. మొత్తం 760.09 కి.మీ మేరగా నిర్మాణం కానున్న మొత్తం కారిడార్‌లో 18 స్టేషన్లు నిర్మించాలని NHSRCL నిర్ణయింది. ఈ కారిడార్ హైదరాబాద్‌లో స్టార్ట్ అయి చెన్నైలో ముగుస్తుంది. అయితే తెలంగాణలో ఈ కారీడార్ 180.32 కి.మీ మేర నిర్మాణం కానుంది. ఈ కారిడార్‌లో హైదరాబాద్, శంషాబాద్, భారత్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి ప్రాంతాల్లో స్టేషన్లు నిర్మించనున్నారు. ఇక ఏపీలో 518.54 కి.మీ మేర ఈ కారిడార్ ఉండగా తొలి స్టేషన్ దాచేపల్లి, తర్వాత అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతితో మిగతా స్టేషన్‌ను నిర్మించనున్నారు. ఇక చివరగా తమిళనాడులో 61.23 కి.మీ. మేర కారిడార్ ఏర్పాటు చేయనుండగా అందులో తిరువళ్లూరు, చెన్నై ఔటర్ రింగ్‌రోడ్, మింజూర్, చెన్నె సెంట్రల్ ప్రాంతాల్లో స్టేషన్ల నిర్మాణం జరగనుంది.
హైదరాబాద్- అమరావతి – చెన్నై ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే..
హైదరాబాద్ టూ చెన్న- జస్ట్ 2 గంటల 55 మినెస్ట్
హైదరాబాద్- అమరావతి – చెన్నై ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే తెలుగురాష్ట్రాలు, తమిళనాడు మధ్య రాకపోకలు మరింత వేగం కానున్నాయి. అలాగే గతంలో కంటే సమయం కూడా చాలా వరకు తగ్గనుంది. అంచనాల ప్రకారం.. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. హైదరాబాద్ నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ కేవలం 2 గంటల 55 నిమిషాలు అంటే సుమారు 3 గంటల లోపే చేరుకోవచ్చు. కానీ ప్రస్తుతం రైళ్లలో ప్రయాణం 12 గంటలు పడుతుంది. అంటే దాదాపు 9గంటల సమయం సేవ్ అవుతుంది
హైదరాబాద్ – అమరావతి: జస్ట్ 70 నిమిషాలు
ఒక వేళ మీరు హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లాలి అనుకుంటే బుల్లెట్ ట్రైన్‌లో జస్ట్ 70 నిమిషాల్లో వెల్లిపోవచ్చు. అదే సాధారణ ట్రైన్‌లో అయితే 6 నుంచి 6 గంటల సమయం పడుతుంది.
అమరావతి – చెన్నై 1 గంట 52 నిమిషాలు
ఇక మీరు అమరావతి నుంచి చెన్నై వెళ్లాలి అనుకుంటే సుమారు 112 నిమిషాలు అంటే 1 గంట 52 నిమిషాలు పడుతుంది. మీరు సాధారణ ట్రైన్‌లో ప్రయాణిస్తే మీకు 6 నుండి 7 గంటల సమయం పడుతోంది. అంటే ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే దాదపు 4 నుంచి 5 గంటల సమయం ఆదా అవుతంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.