
NEET Exam: నీట్ రీ-ఎగ్జామ్ రేపు జరగబోతోంది. అయితే, వివాదాలు మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా, నాగ్‌పూర్‌కు చెందిన ఒక విద్యార్థికి దేశం బయట వేల కిలోమీటర్ దూరంలోని యూఏఈ రాజధాని అబుదాబిలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించడంపై విమర్శలు మొదలయ్యాయి. అయితే, ఈ విషయంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) క్లారిటీ ఇచ్చింది. విద్యా్ర్థి తన రిజిస్టర్ లాగిన్ ద్వారా పరీక్ష కేంద్రాన్ని మార్చుకున్నారని వెల్లడించింది. పరీక్షా కేంద్రాన్ని మార్చాలని అభ్యర్థి నుంచి వచ్చని అభ్యర్థన మేరకు ఎన్టీయే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.
అబుదాబీ సెంటర్ వివాదం:
నీట్(యూజీసీ) 2026 పరీక్ష జూన్ 21న జరగబోతోంది. మొత్తం విద్యార్థుల్లో సుమారు 3.2 లక్షల మంది అభ్యర్థులు తమ పరీక్ష సెంటర్ల మార్పు కోసం రిక్వెస్ట్ పెట్టుకున్నారని, వీరిలో 99.5 శాతానికి పైగా అభ్యర్థులు వారు కోరుకున్న పరీక్ష కేంద్రాన్ని ఎన్టీఏ కేటాయించింది. అబుదాబి ఎగ్జామ్ సెంటర్‌కు సంబంధించిన వివాదంలో, విద్యార్థి సొంత లాగిన్ ద్వారానే ఎగ్జామ్ సెంటర్ మార్పు జరిగిందని, విద్యార్థి తన లాగిన్‌ను పదే పదే యాక్సిస్ చేసినట్లు తెలుస్తోందని ఎన్టీఏ చెప్పింది. విద్యార్థి రిజిస్టర్డ్ లాగిన్‌లో అబుదాబి కేంద్రం తమ వెబ్‌సైట్‌లో మూడు వేర్వేరు సందర్భాలలో కనిపించిందని ఏజెన్సీ పేర్కొంది. ఒక సందర్భంలో అభ్యర్థి ఐడీ పరీక్షా కేంద్రాన్ని అబుదాబికి మార్చగా, మరో రెండు సందర్భాలలో అబుదాబి కేంద్రం ప్రివ్యూ చేయబడింది.
అయినప్పటికీ పరీక్షకు సుమారు 48 గంటల ముందు జూన్ 19న పరీక్షా కేంద్రాన్ని అబుదాబి నుంచి నాగ్‌పూర్ మార్చమని ఎన్టీయేకు అనధికారిక రిక్వెస్ట్ వచ్చింది. ఈ అభ్యర్థన వచ్చిన వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవడానికి అదే సాయంత్రం విద్యార్థి తండ్రిని సంప్రదించినట్లు ఎన్టీఏ తెలిపింది. మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన విద్యార్థి తండ్రి మహ్మద్ తాలిబ్ చెబుతున్న దాని ప్రకారం.. అప్లికేషన్ సమయంలో తాము నాగ్‌పూర్, వార్ధా, భండారాలకు ప్రాధాన్యత ఇచ్చామని, అయితే అడ్మిట్ కార్డులో అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ ఉన్నట్లు కనిపించి షాక్ అయ్యామన్నారు. ఇప్పుడు ఈ వివాదంపై ఎన్టీఏ క్లారిటీ ఇచ్చింది. జూన్ 21న మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు పెన్-అండ్-పేపర్ విధానంలో నీట్ పరీక్ష జరగనుంది. భారత్‌లో 551 నగరాల్లో, విదేశాల్లో 14 నగరాల్లో జరిగే ఈ పరీక్షలో 22.79 మంది అభ్యర్థులు పాల్గొననున్నారు.
Reference the issue with regard to allotment of a centre in Abu Dhabi to a candidate in Nagpur, NTA would like to state the following:
Following the rescheduling of NEET (UG) 2026 to 21 June, the National Testing Agency reopened the examination-city correction window to assist…
— National Testing Agency (@NTA_Exams) June 20, 2026