Reading Time: < 1 minute

IRFC లోన్ వస్తే మెట్రో మరింత విస్తరిస్తుంది… అభివృద్ధి చెందుతుంది: మంత్రి వివేక్ వెంకటస్వామి 

Caption of Image.

హైదరాబాద్ లోని ఆర్టీసీ కళాభవన్ లో నిర్వహించిన ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. IRFC లోన్ ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరానని.. లోన్ ఇప్పిస్తేమెట్రో మరింత విస్తరిస్తుంది, అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎంప్లాయిమెంట్ జనరేషన్ కావాలని ప్రధాని వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన స్కీం తీసుకవచ్చారని అన్నారు.

ఇరాన్ యుద్ధం తర్వాత దేశంలో చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నాయని..ఆయిల్ ధరలు.. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందని.. ఇవన్నీ కూడా జిడిపి గ్రోత్ రేట్ మీద పడుతుందని అన్నారు మంత్రి వివేక్. జీడీపీ గ్రోత్ రేట్ తక్కవైతుందని..జీడీపీ గ్రోత్ రేట్ 7 టూ 8 పర్సంటేజ్ ఉంటే ఎక్కవ ఎంప్లాయ్ మెంట్ జెనరేట్ అవుతుందని అన్నారు. జీడీపీ గ్రోత్ సెటాఫ్ చేయాలని అన్నారు మంత్రి వివేక్.

►ALSO READ | హైదరాబాద్ పబ్లిక్ కు అలర్ట్: KBR పార్క్ వైపు వెళ్తున్నారా..? ఇకపై ట్రాఫిక్ ఆంక్షలు ఇలా…!

రాష్ట్ర ప్రభుత్వం 120 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభిస్తుందని..ఇప్పటికే 65 ప్రారంభమయ్యా.. దీనిలో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత టామ్ కాం ద్వారా ఇతర దేశాల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిసున్నామని అన్నారు.

©️ VIL Media Pvt Ltd.