
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నప్పుడు మనం చెట్ల కింద, బహిరంగ ప్రదేశాలలో (Open places) ఉండకూడదని మనందరికీ తెలుసు. కానీ ఆ సమయంలో మనం ఇంట్లో ఉంటూ తెలియకుండా చేసే కొన్ని చిన్న పనులు కూడా మనల్ని పెద్ద ప్రమాదంలో పడేస్తాయని మీకు తెలుసా? అవును, మెరుపు మనల్ని నేరుగా తాకకపోయినా, అది నీరు, వైర్లు, పైపులు , మెటల్ వస్తువుల ద్వారా ప్రయాణించి మనకు షాక్ కొట్టేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ హిడెన్ డేంజర్స్ (Hidden dangers) నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి, తుఫాను సమయంలో చేయకూడని ఆ ముఖ్యమైన విషయాలేంటో ఇక్కడ చూద్దాం:
1. తడి వస్తువులను అస్సలు తాకవద్దు (డోంట్ టచ్ వెట్ ఆబ్జెక్ట్స్)
ఉరుములతో కూడిన తుఫాను సమయంలో, నీరు నేరుగా మెరుపును ఆకర్షించకపోవచ్చు. కానీ, అది ఎలక్ట్రిసిటీని చాలా వేగంగా పాస్ చేయగలదు. దీని అర్థం ఏమిటంటే, మీకు సమీపంలో ఎక్కడైనా మెరుపు పడితే, దాని నుండి వచ్చే కరెంట్ నీటి ద్వారా ప్రయాణించి మిమ్మల్ని తాకవచ్చు. అందుకే తుఫాను వచ్చే సూచనలు ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్స్, చెరువులు, ఎలాంటి తడి వస్తువులనైనా తాకవద్దని నేషనల్ వెదర్ సర్వీస్ (National Weather Service) హెచ్చరిస్తోంది.
2. ప్లగ్ చేసి ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడకండి
వర్షాకాలంలో ఛార్జింగ్, ప్లగ్ చేసి ఉన్న ల్యాండ్‌లైన్ ఫోన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లను ఎప్పుడూ ఉపయోగించవద్దు. సీడీసీ (CDC – Centers for Disease Control and Prevention) ప్రకారం, మెరుపులు టెలిఫోన్ , విద్యుత్ తీగల (Wires) ద్వారా సులభంగా ప్రయాణించగలవు. అటువంటప్పుడు వాటిని వాడితే మీకు ఎలక్ట్రిక్ షాక్ తగిలే ప్రమాదం ఉంది. ఇది ల్యాప్‌టాప్‌లు, టోస్టర్‌లు , ప్లగ్ చేసి ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్ (Electronic devices) అన్నింటికీ వర్తిస్తుంది. కాబట్టి, హెవీ రెయిన్ లేదా థండర్‌స్టార్మ్ అలర్ట్ ఉన్నప్పుడు ప్లగ్ కనెక్ట్ అయి ఉన్న దేనినీ ముట్టుకోవద్దు. వర్షం స్టార్ట్ అవ్వడానికి ముందే వాటి ప్లగ్స్ తీసివేయడం (Unplug చేయడం) చాలా బెస్ట్.
3. వర్షం ఆగిపోగానే బయటకు వెళ్లడం సేఫ్ కాదు!
వర్షం ఆగిపోయిన వెంటనే బయటకు వెళ్లి వాతావరణాన్ని ఎంజాయ్ చేయడం చాలా మందికి అలవాటు. కానీ అలా చేయడం ముమ్మాటికీ పొరపాటే. సీడీసీ (CDC) నివేదిక ప్రకారం.. వర్షం ఆగినంత మాత్రాన డేంజర్ పూర్తిగా తగ్గిపోయినట్లు కాదు. మెరుపు కనిపించిన 30 సెకన్లలోపు మీకు ఉరుము వినిపిస్తే, మీరు వెంటనే సేఫ్ ప్లేస్‌కు వెళ్ళిపోవాలి. అలాగే, వర్షం పూర్తిగా ఆగిపోయిన కనీసం 30 నిమిషాల తర్వాతే ఇల్లు దాటి బయటకు వెళ్లాలి. ఎందుకంటే తుఫాను వెళ్లిపోయినట్లు అనిపించినా, మైళ్ల దూరం నుంచే మెరుపులు ఒక్కసారిగా స్ట్రైక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
4. కాంక్రీట్ గోడలు, పిల్లర్లకు దూరంగా ఉండండి
కాంక్రీట్ గోడలు చాలా బలంగా కనిపిస్తాయి కాబట్టి వాటి పక్కన నిలబడితే సేఫ్ అనుకుంటారు. కానీ తుఫాను సమయంలో వాటి దగ్గర నిలబడటం సేఫ్ కాదు. ఎందుకంటే, కాంక్రీట్ గోడలు , నేలల (Flooring) లోపల బిల్డింగ్ సపోర్ట్ కోసం ఇనుప కడ్డీలు (Metal rods) ఉంటాయి. ఇవి విద్యుత్తును చాలా ఈజీగా పాస్ చేస్తాయి. అందువల్ల, ఉరుములు, మెరుపులు పూర్తిగా తగ్గే వరకు కాంక్రీట్ నిర్మాణాలకు దూరంగా ఉండటమే మంచిది.
5. తుఫాను సమయంలో స్నానాలు, పాత్రలు కడగడం వద్దు
భారీ వర్షం లేదా ఉరుములు వచ్చేటప్పుడు ఎప్పుడూ స్నానం చేయకూడదు. ఒకవేళ మెరుపు మీ ఇంటిని గానీ , పక్కనే ఉన్న ఏరియాను గానీ తాకినప్పుడు, ఆ పవర్ ప్లంబింగ్ పైపుల (Metal pipes) ద్వారా ప్రయాణించి, షవర్ కింద స్నానం చేస్తున్న వారికి లైవ్ షాక్ తగిలేలా చేస్తుంది. స్నానం చేయడమే కాకుండా, బేసిన్ దగ్గర చేతులు కడగడం, కిచెన్‌లో పాత్రలు తోమడం కూడా డేంజరే. ‘మిత్‌బస్టర్స్’ (MythBusters) అనే పాపులర్ సైన్స్ షోలో చేసిన ఒక లైవ్ ఎక్స్‌పెరిమెంట్‌లో కూడా.. మెరుపులు పడుతున్నప్పుడు స్నానం చేయడం వల్ల హెవీ షాక్ , నిప్పురవ్వలు (Sparks) వస్తాయని ప్రాక్టికల్‌గా నిరూపించారు. కాబట్టి, వర్షం పడేటప్పుడు ఇంట్లోనే ఉంటూ ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు..